Breaking News

నటుడిగా నేను సక్సెస్‌ అయ్యా: బెల్లంకొండ గణేశ్‌

Published on Wed, 05/31/2023 - 18:34

‘స్వాతిముత్యం’ సినిమాతో సక్సెస్‌ఫుల్‌గా రంగప్రవేశం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సర్'తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్‌ ఉప్పలపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. అవంతిక దస్సాని హీరోయిన్‌గా నటిస్తోంది. జూన్ 2న నేను స్టూడెంట్ సర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో  హీరో బెల్లంకొండ గణేష్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలను పంచుకున్నారు. 

► నేను ఎప్పుడూ స్టూడెంట్‌లానే ఫీలవుతాను. రియల్ లైఫ్‌లో జరిగే పరిస్థితులు ఇందులో ఎక్కువగా ఉంటాయి. చివరి వరకూ చాలా క్యూరియాసిటీ ఉంటుంది. క్లైమాక్స్ వచ్చే వరకు అసలు విలన్ ఎవరనేది ఊహించలేరు. అది మాత్రం వందశాతం హామీ ఇవ్వగలము.

► ఈ కథని కృష్ణ చైతన్య గారు రాశారు. రాకేష్ గారు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశారు. కృష్ణ చైతన్య గారు కథ చెప్పినపుడు ఇందులో ఉన్న ఎమోషన్, క్యారెక్టర్ ఆర్క్ కి బాగా కనెక్ట్ అయ్యాను.

► ఈ పాత్ర నా కెరీర్‌కు చాలా ప్లస్ అవుతుంది. చాలా మంది పెద్ద హీరోలు వారి రెండో సినిమాలో స్టూడెంట్ పాత్ర చేశారు. ఇది నాకు మంచి బూస్ట్ అవుతుంది. 

► భాగ్యశ్రీ మా అన్నయ్య సినిమాలో నటించారు. అదే సమయంలో వారి అమ్మాయిని తెలుగులో లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని చెప్పారు. ఈ సినిమాకు ఒక కొత్త అమ్మాయి అయితే బావుంటుందనిపించి అవంతికని తీసుకున్నాం.

► నాందితో మంచి విజయం అందుకున్న నిర్మాత సతీష్ వర్మ ఈ సినిమా కోసం చాలా ప్యాషన్‌తో పని చేశారు. అందరికంటే ముందు సెట్‌కు వచ్చి అందరికంటే చివర్లో వెళ్ళేవారు. సినిమాకి ఏం కావాలో అది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చారు.

► స్వాతిముత్యం రిలీజ్ చేసినప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారి సినిమాలతో కలసి రావడం వలన బ్యాడ్ రిలీజ్ డేట్ అనే మాట వినిపించింది. ఉన్నవాట్లో మనదొక్కటే ఫ్యామిలీ సినిమా పండక్కి ఆడే ఛాన్స్ ఉంటుందనే నమకంతో నిర్మాతలు ఆ డేట్‌కు విడుదల చేశారు. అది ఇంకా బాగా ఆడాల్సింది. అయితే ఓటీటీలో దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా చాలా మంచి సినిమా చేశారని ప్రశంసిస్తున్నారు. ఈ విషయంలో నటుడిగా నేను సక్సెస్ అయ్యాననే భావిస్తాను. ఇప్పుడు ‘నేను స్టూడెంట్ సర్' పై మాకు పూర్తి నమ్మకంగా వుంది. మంచి సినిమాని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం వుంది.

► మహతి చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మంచి సినిమా చుశామనే అనుభూతితో పాటు మంచి ఆర్ఆర్ విన్నామనే ఫీలింగ్‌తో ప్రేక్షకులు బయటికి వస్తారు. 

Videos

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)