Breaking News

'ఇడ్లీ కొట్టు' టైటిల్‌ ఎందుకు పెట్టామంటే..: ధనుష్‌

Published on Tue, 09/16/2025 - 07:09

నటుడు ధనుష్‌ తాజాగా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ఇడ్లీ కడై (ఇడ్లీ కొట్టు). నటి నిత్యామీనన్‌ నాయకిగా నటించారు.  శాలిని పాండే, సత్యరాజ్, అరుణ్‌విజయ్, రాజ్‌కిరణ్, పార్తీపన్, సముద్రఖని తదితరలు ముఖ్య పాత్రలు పోషించారు. డాన్‌ పిక్చర్స్, వండర్‌బార్‌ ఫిలింస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని అందించారు. కాగా  నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్‌1వ తేదీన విడుదల కానుంది.  

ఈ సినిమా విడుదల సందర్భంగా నటుడు ధనుష్‌ మాట్లాడుతూ   ఈ చిత్రానికి ఇడ్లీ కొట్టు అని పేరు పెట్టడానికి కారణం గురించి చెబుతూ చిన్నతనంలో తనకు రోజూ ఇడ్లీ తినాలని ఆశగా ఉండేదన్నారు. అయితే చేతిలో డబ్బు ఉండేది కాదన్నారు. దీంతో  తోటల్లో  పూలు కోసే పనికి వెళితే రోజుకు రూ. 2 లేదా 2.50 రూపాయలు ఇచ్చేవారన్నారు. ఆ డబ్బుతో నాలుగు లేదా ఐదు ఇడ్లీ వస్తే కొనుక్కుని తినేవాడినన్నారు. ఆ ఇడ్లీ రుచి ఇప్పుడు పెద్ద పెద్ద ఫైవ్‌స్టార్‌ హోటళ్లలోనూ లభించడం లేదన్నారు. ఆ ఇడ్లీ కొట్టు ఇతి వృత్తంతో చిత్రం చేయాలని అనిపించిందన్నారు. అలా నిజమైన కథ, నిజమైన పాత్రలతో చిత్రం చేసినట్లు ధనుష్‌ చెప్పారు. 

అదే విధంగా తన హేటర్స్‌ గురించి స్పందిస్తూ అసలు హేటర్స్‌ అనే కాన్సెప్టే పరిశ్రమలో లేదన్నారు. అలాంటి వారు కూడా ఇక్కడ లేరన్నారు. అందరూ అన్ని చిత్రాలు చూస్తుంటారని, అలాంటిది హేటర్స్‌ ఎవరని చెప్పాలంటూ పేర్కొన్నారు. అయితే ఒక 30 మంది తమ జీవనం కోసమో లేదా మరేదైనా ఆశించో 300 ఐడియాలతో ఏదైనా తప్పుడు ప్రచారం చేయడమే హేట్‌ అని తెలిపారు. ఆ 30 మంది కూడా చిత్రాలను చూస్తారని ధనుష్‌ పేర్కొన్నారు. ఇకపోతే ఈ వేదికపై మాట్లాడిన నటుడు పార్తీపన్‌ నటుడు ధనుష్‌ను సకలకళావళ్లభుడిగా పేర్కొన్నారు. ఇక ఆయన అభిమానులైతే యువ సూపర్‌స్టార్‌ అంటూ పోస్టర్లతో ప్రచారం చేశారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)