Breaking News

పాకిస్థాన్‌ 10 వీడియోలు.. NIA అదుపులో బయ్యా సన్నీ యాదవ్‌

Published on Fri, 05/30/2025 - 08:32

తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు అరెస్ట్‌ చేశారు. చెన్నై ఎయిర్‌పోర్టులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ట్రావెల్‌లో భాగంగా ఆయన కొద్దిరోజుల క్రితం పాకిస్థాన్‌కు వెళ్లారు. అక్కడ పరిస్థితిలు ఎలా ఉంటాయో తన యూట్యూబ్‌లో చెప్పుకొచ్చాడు. పాక్‌లో మొదటిరోజు అంటూ ఒక వీడియోను ఆయన రీసెంట్‌గా షేర్‌ చేశారు. దానిని చూసిన ఎన్‌ఐఏ అధికారులు బయ్యా సన్నీ యాదవ్‌ను అరెస్ట్‌ చేశారు.

పహల్గాం (Pahalgam Terror Attack)లో ఏప్రిల్‌ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన  దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో పాక్‌పై భారత్‌ దాడికి దిగింది.  ఇలాంటి సమయంలోనే బయ్యా సన్నీ యాదవ్‌ పాక్‌ వెళ్లినట్లు 10 వీడియోలను పంచుకున్నారు. వాటిపై ఎన్‌ఐఏ అధికారులు విచారిస్తున్నారు. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో అతను పాకిస్థాన్‌ వెళ్లినట్లు సమాచారం. ఏప్రిల్‌లో పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులు అంతర్జాతీయ స్థాయిలో చర్చలకు దారి తీసింది. ఇలాంటి సమయంలో తన వీడియోలకు ఎక్కువ వ్యూస్‌ వస్తాయని వాటితో డబ్చు చేసుకోవచ్చనే ఉద్దేశంతో తన యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశారని తెలుస్తోంది.

పాకిస్థాన్‌కు గూఢచారిగా వ్యవహరించిందని హరియాణాకు చెందిన యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాను (Jyoti Malhotra) పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  మల్హోత్రాను ఓ అస్త్రంగా పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లు (ISI) మలచుకున్నట్లు హరియాణా పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని పాక్‌ రాయబార కార్యాలయంలోని ఒక అధికారితో ఆమె టచ్‌లో ఉన్నట్లు కూడా విచారణలో గుర్తించారు. ట్రావెల్‌ వీడియోస్‌ పేరుతో జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌లో పలుమార్లు పర్యటించిందని పోలీసులు గుర్తించారు. ఓసారి చైనాకూ కూడా ఆమె వెళ్లి వచ్చినట్లు ఆధారాలు సేకరించారు. ఆమె తరహాలోనే  బయ్యా సన్నీ యాదవ్‌కు కూడా ఏమైనా పాక్‌ అధికారులతో పరిచయాలు ఉన్నాయా..? అనే కోణంలో ఎన్‌ఐఏ అధికారులు విచారించనున్నారు. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌