Breaking News

నటుడు దర్శన్‌పై జడ్జి ఆగ్రహం.. సాకులు చెప్పొద్దంటూ హెచ్చరిక

Published on Thu, 04/10/2025 - 09:08

చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌ కోర్టు విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో బెంగళూరు 57వ సీసీహెచ్‌ కోర్టు జడ్జి అసంతృప్తి వ్యక్తం చేశారు. బెయిల్‌ ఇస్తున్న సమయంలో విచారణకు తప్పకుండా హాజరుకావాలని కోర్టు షరతులను మరోసారి న్యాయస్థానం గుర్తుచేసింది. అయితే, విచారణ సమయంలో దర్శన్‌కు వెన్నునొప్పి ఉందని, అందుకే రాలేదని ఆయన తరఫు వకీలు చెప్పారు. సాకులు చెప్పి కోర్టుకు హాజర్‌ కాకుంటే ఎలాగని జడ్జి ఘాటుగా ప్రశ్నించారు. 

విచారణ ఉన్నప్పుడు నిందితులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఇలా చేయడం తప్పని మందలించారు. దర్శన్‌ ఇంటిలో పోలీసులు జప్తు చేసిన రూ.75 లక్షల డబ్బులను విడుదల చేయాలని న్యాయవాది మనవి చేశారు. ఐటీ శాఖ వాదనలు విన్న తరువాత పరిశీలిస్తామని జడ్జి తెలిపారు. కేసు విచారణను మే 20కి వాయిదా వేశారు. సీజ్‌ చేసిన మొబైల్‌ఫోన్లను తిరిగి ఇవ్వాలని దర్శన్‌ న్యాయవాది అర్జీ వేశారు. మొదటి నిందితురాలు, నటి పవిత్రగౌడతో పాటు ఇతర నిందితులందరూ కోర్టుకు వచ్చారు. తన సోదరునితో కలిసి పవిత్ర ఆర్‌ఆర్‌ నగర ఇంటి నుంచి కారులో కోర్టుకు వచ్చారు.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు