లాల్‌ దర్వాజ అమ్మవారికి బంగారు బోనమెత్తిన బేబీ హీరోయిన్‌

Published on Sun, 07/16/2023 - 15:38

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో లాల్‌ దర్వాజ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్య ప్రజానీకంతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తాజాగా బేబీ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బేబీ సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మా సినిమా సక్సెస్‌ తర్వాత తొలి బోనం మహంకాళి అమ్మవారికి తీసుకుని వస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది.

బేబీ రిలీజవడానికి ముందు సికింద్రాబాద్‌ ఉజ్జయిని అమ్మవారికి బోనమెత్తాను. దర్శనం కూడా బాగా జరిగింది' అని చెప్పుకొచ్చింది. గతానికి, ఇప్పటికి తేడా ఏంటన్న ప్రశ్నకు.. ఎప్పుడూ లైన్‌లో వస్తుండె.. ఇప్పుడు జర స్పెషల్‌ ఎంట్రీతో వచ్చిన అని చెప్పుకొచ్చింది. హైదరాబాద్‌ పాతబస్తీకి చెందిన వైష్ణవి చైతన్య టిక్‌టాక్‌ వీడియోలతో పాపులర్‌ అయింది. అలాగే పలు షార్ట్‌ ఫిలింస్‌ ద్వారా కూడా పేరు తెచ్చుకుంది. యూట్యూబ్‌లో వెబ్‌ సిరీస్‌లు చేసే వైష్ణవి బేబీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది.

యూట్యూబర్‌ హీరోయినేంటి? అన్న చాలామంది ప్రశ్నలకు తన నటనతో నోరు మూయించింది. ఇక బేబీ సినిమాను సాయి రాజేశ్‌ డైరెక్ట్‌ చేయగా ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాత ఎస్‌కేఎన్‌ నిర్మించాడు. జూలై 14న విడుదలైన ఈ చిత్రం రెండు రోజుల్లోనే రూ.14 కోట్ల పై చిలుకు వసూళ్లు రాబట్టడం విశేషం.

చదవండి: బుల్లితెర నటి బోల్డ్‌ పిక్స్‌.. నెటిజన్స్‌ దారుణ కామెంట్స్‌

Videos

గుర్తుపెట్టుకో అనిత.. మేమిచ్చే రిటర్న్స్ గిఫ్ట్ కి దిమ్మతిరిగి బొమ్మ కనపడుద్ది

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు

వీళ్లు అసలు పోలీసులా రౌడీలా... YSRCP నేతలపై దాడులు.. సజ్జల స్టాంగ్ రియాక్షన్

అర్ధరాత్రి కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్.. పల్నాడులో హైటెన్షన్...

ఏపీలో నేటి నుంచి పరిషత్ పోరు.. నామినేషన్ల వేళ టెన్షన్!

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

నన్ను చంపితే 2028లోపే చంపండి.. 2029 మాత్రం మీకు చుక్కలే

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

Photos

+5

విజయవాడ : భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సెలెబ్రెటీలు (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!