Breaking News

సారీ చెప్పమన్న 'బేబీ' డైరెక్టర్‌.. రెండేళ్ల జీవితం ధారపోశానన్న హీరో

Published on Mon, 05/05/2025 - 08:57

బాలీవుడ్‌లో కనీస మర్యాద ఇవ్వరు.. ఇంత నకిలీ ఇండస్ట్రీ మరొకటి ఉండదు అంటూ హిందీ చిత్రపరిశ్రమపై ఫైర్‌ అయ్యాడు ఇర్ఫాన్‌ ఖాన్‌ తనయుడు, హీరో బాబిల్‌ ఖాన్‌ (Babil Khan). అర్జున్‌ కపూర్‌, అనన్య పాండే, షనయా కపూర్‌, అర్జిత్‌ సింగ్‌.. ఇలా ఇండస్ట్రీతో సంబంధం లేని చాలామంది ఉన్నారని, బాలీవుడ్‌ పని చేయడానికి మంచి ప్రదేశం కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

అసలు ఏమనుకుంటున్నావ్‌?
కొన్ని గంటల తర్వాత తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చాడు. అర్జున్‌, అనన్య, షనయా, అర్జిత్‌లను తాను విమర్శించలేదని, సపోర్ట్‌ చేశానని పేర్కొన్నాడు. దీనిపై తెలుగు డైరెక్టర్‌ సాయి రాజేశ్‌ (Sai Rajesh) స్పందించాడు. అంటే ఇప్పటివరకు నీకు సపోర్ట్‌ చేసిన మేము ఇప్పుడు సైలెంట్‌గా ఈ టాపిక్‌ను వదిలేయాలంటావ్‌.. అసలు మా గురించి ఏం అనుకుంటున్నావ్‌? అంటే.. నువ్వు వీడియోలో పేర్కొన్న వారికి మాత్రం గౌరవం ఇస్తే సరిపోతుందా? 

సారీ చెప్పాల్సిందే!
నీకు సపోర్ట్‌ చేసిన మేమంతా పిచ్చివాళ్లమా? నీకు నిజంగా వాళ్లను పొగడాలి, గౌరవం ఇవ్వాలి.. అనిపిస్తే ఇచ్చుకో.. కానీ నీకోసం నిల్చున్న మా అందరినీ లైట్‌ తీసుకోవడం కరెక్ట్‌ కాదు. నువ్వు మాకు క్షమాపణలు చెప్పాల్సిందే అని పోస్ట్‌ పెట్టాడు. ఇది చూసిన బాబిల్‌.. నువ్వు నా మనసు ముక్కలు చేశావ్‌.. నీకోసం నేను చేయాల్సిందంతా చేశాను. రెండేళ్ల జీవితాన్ని నీ ముందు ధారపోశాను.

మణికట్టు కోసుకున్నా
ఒళ్లు హూనం చేసుకుని నా శరీరాన్ని పాత్రకు తగ్గట్లుగా మలుచుకున్నాను. కానీ ఏం చేసినా అన్నీ తిరస్కరించావ్‌. ఎంత బాధున్నా దిగమింగుకుని నవ్వుతూ కనిపించాను. మురికిగుంటలో బొర్లాను. నీకోసం నా చేయి కోసుకున్నాను అని కామెంట్స్‌ చేశాడు. తర్వాత ఈ కామెంట్స్‌ డిలీట్‌ చేశాడు.

బేబీ రీమేక్‌లో బాబిల్‌?
బేబీ సినిమా (Baby Movie)తో రూ.100 కోట్ల హిట్‌ అందుకున్నాడు దర్శకుడు సాయి రాజేశ్‌. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయాలనుకున్నాడు. ఇందుకోసం నటుడు బాబిల్‌ ఖాన్‌ను ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే రెండేళ్లగా అతడిని తిప్పించుకున్న సాయి రాజేశ్‌ చివరకు అతడిని రిజెక్ట్‌ చేశాడని తెలుస్తోంది.

 

Babil reacts to filmmaker Sai Rajesh’s criticism: “I slit my wrist for him”
byu/Normal_Weather8827 inBollyBlindsNGossip

 

చదవండి: బాలీవుడ్‌ అంతా కాపీనే: నవాజుద్దీన్‌ సిద్దిఖీ

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)