Breaking News

సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ

Published on Tue, 04/02/2024 - 12:47

టాలీవుడ్‌ నటుడు అవసరాల శ్రీనివాస్‌.. ఆ మధ్య పిండం సినిమాతో హిట్‌ అందుకున్నాడు. ఈగల్‌లోనూ ముఖ్య పాత్రలో కనిపించాడు. కిస్మత్‌లోనూ కీలక పాత్రలో మెరిశాడు. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిస్మత్‌ మూవీ థియేటర్లలో పెద్దగా సౌండ్‌ చేయలేదు. ఈ చిత్రంలో నరేష్‌ అగస్త్య, అభినవ్‌ గోమఠం, విశ్వదేవ్, రియా సుమన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. బీటెక్‌ బాధితులను దృష్టిలో పెట్టుకుని తీసినట్లుగా ఉంటుందీ సినిమా. వారికైతే కచ్చితంగా కనెక్ట్‌ అవుతుంది. ఈ మూవీ ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

కథేంటంటే?
ముగ్గురు స్నేహితులు బీటెక్‌ చదువు పూర్తి చేసుకుని ఊరికి వచ్చేస్తారు. తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తుంటారు. విశ్వదేవ్‌ నమ్మకం కోల్పోయి ఉంటాడు. రియా సుమన్‌తో నరేశ్‌ అగస్త్య ప్రేమలో ఉంటాడు. అభినవ్‌ గోమఠానికి సినీ రచయిత అవ్వాలన్నది కల. ఇంట్లో వాళ్ల పోరు తట్టుకోలేక హైదరాబాద్‌ వచ్చి ఉద్యోగం కోసం వేట మొదలుపెడతారు. ఆ తర్వాత జరిగిన  ఓ సంఘటన వల్ల ఈ ముగ్గురి కిస్మత్‌ (అదృష్టం) ఎలా మారిందనేదే కథ! ఇక ఈ చిత్రాన్ని శ్రీనాథ్‌ బాదినేని దర్శకత్వంలో కామ్రేడ్‌ ఫిలిం ఫ్యాక్టరీ, అధీరా ప్రొడక్షన్స్‌ పతాకాలపై రాజు నిర్మించారు. మార్క్‌ కె రాబిన్‌ సంగీతం అందించాడు.

చదవండి: కావాలయ్యా.. సాంగ్‌పై దారుణ ట్రోల్స్‌.. మైండ్‌సెట్‌ మారాలన్న మిల్కీబ్యూటీ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)