Breaking News

నిన్ను పెళ్లి చేసుకుంటే భార్యను కాదు తల్లినవుతా!: హీరోయిన్‌ కౌంటర్‌

Published on Sat, 09/06/2025 - 14:15

కొందరు సెలబ్రిటీలతో సెల్ఫీ వరకే ఆగరు.. నన్ను పెళ్లి చేసుకుంటావా? గుండెల్లో పెట్టి చూసుకుంటా! అని సినిమా డైలాగులు కూడా పేలుస్తుంటారు. అలా చాలామంది హీరోయిన్లకు ఇలాంటి ప్రపోజల్స్‌ వస్తూనే ఉంటాయి. అందరూ ఇవి చూసి ఓ చిన్న నవ్వు నవ్వేసి లైట్‌ తీసుకుంటారు. తాజాగా మలయాళ హీరోయిన్‌ అవంతిక మోహన్‌ (Avantika Mohan)కు కూడా ఇలాంటి ప్రపోజలే వచ్చిందట! కాకపోతే ఆ కుర్రాడికింకా 17 ఏళ్లే! 

నువ్వింకా పిల్లాడివి
పదేపదే పెళ్లి చేసుకోమని మెసేజ్‌లు చేస్తూ ఉండటంతో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించింది అవంతిక. కొంతకాలంగా నాకు మెసేజ్‌లు చేస్తూ ఉన్న ఓ చిన్ని అభిమానికి నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నీకింకా 16 లేదా 17 ఏళ్లు ఉంటాయనుకుంటా.. జీవితమంటే ఏంటో నీకింకా పూర్తిగా తెలీదు. ఏడాదికాలంగా నన్ను పెళ్లి చేసుకోమని వెంటపడుతున్నావ్‌.. కానీ, నువ్వింకా చిన్నపిల్లాడివి. మ్యారేజ్‌కు బదులుగా పరీక్షల కోసం ఆలోచించాల్సిన వయసులో ఉన్నావ్‌!

నేను తల్లి అనుకుంటారు
నీకంటే నేను చాలా పెద్దదాన్ని. ఒకవేళ మనిద్దరం పెళ్లి చేసుకున్నామనుకో.. అందరూ నన్ను నీ భార్య అనుకోరు, నీ తల్లిగా పొరబడుతారు. కాబట్టి బుద్ధిగా చదువుకో.. సరైన సమయం వచ్చినప్పుడు నీ లైఫ్‌లోనూ మంచి లవ్‌స్టోరీ ప్రారంభమవుతుంది అని చెప్పుకొచ్చింది. అవంతిక.. యక్షి- ఫేత్‌ఫుల్లీ యువర్స్‌, గర, ఆలమరం వంటి పలు మలయాళ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె కీలక పాత్రలో నటించిన ధీరమ్‌ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈమె సినిమాలతో పాటు పలు సీరియల్స్‌ చేసింది. 2017లో అనిల్‌ కుమార్‌ను పెళ్లాడగా వీరికి రుద్రాన్ష్‌ అనే కుమారుడు సంతానం.

చదవండి: బిగ్‌బాస్‌ 9 లో యూట్యూబ్‌ సెన్సేషన్‌? ఒక్క పోస్ట్‌తో తేల్చేసిందిగా!

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)