Breaking News

రాబిన్‌హుడ్‌ మూవీ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా సన్‌రైజర్స్ మాజీ కెప్టెన్!

Published on Thu, 03/20/2025 - 17:23

నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ సినిమా ఉగాది కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. భీష్మ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ తేదీ దగ్గర పడుతుండగా.. మూవీ టీమ్ ప్రమోషన్ల జోరుతో దూసుకెళ్తోంది. కాలేజీల్లో వరుస ఈవెంట్లతో నితిన్ టీమ్ సందడి చేస్తోంది.

అయితే ఈ మూవీలో పుష్ప మేనరిజంతో అభిమానులను ఆకట్టుకున్న ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ ఓ పాత్రలో కనిపించనున్నారు. ఓ సినిమా ఈవెంట్‌లో ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ద్వారా డేవిడ్ వార్నర్‌ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టీమ్‌కు కెప్టెన్‌గా పనిచేశారు. దీంతో వార్నర్‌కు టాలీవుడ్ ఫ్యాన్స్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడేమో ఏకంగా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.ట

తాజాగా రాబిన్‌హుడ్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు డేవిడ్ వార్నర్ హాజరు కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్‌కు అనుమతుల కోసం చిత్రబృందం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. భారీగా అభిమానులు వచ్చే అవకాశం ఉండడంతో ముందస్తుగా జాగ్రత్తలు తీసుకునే పనిలో రాబిన్‌హుడ్‌ టీమ్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఏదేమైనా తెలుగు సినిమా ఈవెంట్‌కు డేవిడ్ వార్నర్‌ హాజరైతే మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుందని టాలీవుడ్ ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రాబిన్ హుడ్‌ మూవీ మార్చి 28న థియేటర్లలో సందడి చేయనుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)