Breaking News

దేశంలోనే ఖరీదైన సినిమా.. అట్లీ ఎలివేషన్స్

Published on Sat, 06/14/2025 - 19:34

అల్లు అర్జున్.. 'పుష్ప 2' తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి ఇదివరకే రెండు వీడియోలు రిలీజ్ చేశారు. వీటి ద్వారా మూవీ ఏ రేంజులో ఉండబోతుంది? ఎంత భారీ ఎత్తున నిర్మించబోతున్నారనేది హింట్ ఇచ్చేశారు. కానీ ఇటు బన్నీ గానీ అటు అట్లీ గానీ రీసెంట్ టైంలో మీడియాకు దొరకలేదు. కాబట్టి వీడియోలతో అభిమానులు సరిపెట్టుకున్నారు. కానీ తాజాగా సత్యభామ యూనివర్సిటీలో డాక్టరేట్ అందుకున్న అట్లీ.. అల్లు అర్జున్‌తో చేయబోయే చిత్రం గురించి అదిరిపోయే విషయాలు బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: 'కన్నప్ప' ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే?)

'దేశంలోనే ఇదే ఖరీదైన సినిమా. చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నాం. సరికొత్త టెక్నాలజీ కూడా పరిచయం చేయబోతున్నాం. బడ్జెట్ ఎంతనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సినిమా తీయడం వరకే నా బాధ్యత. విడుదల ఎప్పుడనేది నిర్మాత తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది' అని అట్లీ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అట్లీ చెప్పిన దాని బట్టి చూస్తుంటే హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఇదివరకు కాస్ట్ లీ మూవీస్ అంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల గురించి మాట్లాడుకునేవాళ్లు. త్వరలో అల్లు అర్జున్-అట్లీ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటారేమో. ఇందులో బన్నీ.. మూడు డిఫరెంట్ పాత్రల్లో కనిపించబోతున్నాడని సమాచారం. అందుకు తగ్గట్లే దీపికా పదుకొణెని ఇదివరకే హీరోయిన్‌గా ప్రకటించారు. వీళ్లతో పాటు మృణాల్ ఠాకుర్, జాన్వీ కపూర్ కూడా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ముంబైలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైపోయిందని టాక్. ప్రస్తుతానికైతే అట్లీ చెప్పినవే అప్డేట్స్. మిగిలినవి త్వరలో బయటపెడతారేమో?

(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 మూవీస్) 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)