Breaking News

లెహంగా తయారీకి 10 వేల గంటలా.. ఎందుకంత స్పెషల్?

Published on Tue, 01/24/2023 - 18:39

క్రికెటర్ కేఎల్ రాహుల్- బాలీవుడ్ నటి అతియా శెట్టి ఈనెల 23 వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. బంధువులు, సన్నిహితులు, స్నేహితుల మధ్య ఒ‍క్కటైంది ఈ ప్రేమజంట. సునీల్ శెట్టి ఫామ్‌హౌస్ ఖందాలాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. పెళ్లిరోజు సంప్రదాయ దుస్తుల్లో ఉన్న వధూవరుల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. అయితే అతియా శెట్టి ధరించిన పింక్ కలర్ లెహంగాపైనే బీ టౌన్‌లో చర్చ నడుస్తోంది. ఈ వేడుకలో అతియా ధరించిన లెహంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది అయితే ఆ డ్రెస్ ఎందుకంత స్పెషల్? అందులో ప్రత్యేకత ఏంటో ఓ లుక్కేద్దాం. 

(ఇది చదవండి: మా జీవితకాలం గుర్తుండిపోయే రోజు: అతియా శెట్టి ఎమోషనల్ పోస్ట్)

పెళ్లిలో అతియా శెట్టి ధరించిన లెహంగా తయారీకి దాదాపు 10,000 గంటల సమయం పట్టిందని ప్రముఖ డ్రెస్ డిజైనర్ అనామిక ఖన్నా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతియా శెట్టి లెహంగా తయారీకి 416 రోజులు, 10 వేల గంటలు పట్టిందని ఆమె తెలిపారు. అతియా శెట్టి వివాహ లెహంగాను పూర్తిగా చేతితో తయారు చేసినట్లు పేర్కొన్నారు. జర్దోజీ, జాలీ వర్క్‌ పట్టుతో రూపొందించినట్లు వివరించారు. 

డిజైనర్ మాట్లాడుతూ.. 'అతియా చాలా చక్కగా,అందమైన అమ్మాయి. ఆమె వధువు కాబోతుందన్న వాస్తవాన్ని ప్రతిధ్వనించేలా లెహంగా డిజైన్ చేశాం. ఆమె కోసం ప్రత్యేకంగా తయారు చేశాం. అతియాపై ప్రేమతో ఆ వధువు ధరించిన లెహంగాను పదివేల గంటలపాటు కష్టపడి రూపొందించాం.' అని అనామిక చెప్పకొచ్చింది.

(ఇది చదవండి: అతియా శెట్టి- కేఎల్ రాహుల్ పెళ్లి.. వారికి మాత్రమే ఎంట్రీ)

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)