Breaking News

కేఎల్ రాహుల్ సతీమణి బేబీ బంప్‌ ఫోటోలు.. అక్కినేని వారి కోడలు కామెంట్!

Published on Thu, 01/30/2025 - 15:40

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌(Kl Rahul) త్వరలోనే తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. 2023లో బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టిని(Athiya Shetty) కేఎల్ పెళ్లాడారు. గతేడాది నవంబర్‌లో ఈ జంట అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు అభినందనలు తెలిపారు. కాగా.. రాహుల్‌, అతియాల వివాహం 2023, జనవరి 23న జరిగింది. బాలీవుడ్ భామ అతియా శెట్టి ప్రముఖ నటుడు సునీల్‌ శెట్టి (Sunil Shetty) గారాలపట్టి అన్న విషయం తెలిసిందే. అతియా కూడా పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించింది. వీరిద్దరు కొంతకాలం పాటు డేటింగ్‌ చేసి ప్రేమ వివాహం చేసుకున్నారు.

అయితే తాజాగా అతియా శెట్టి తన బేబీ బంప్(Baby Bump) ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సన్‌ఫ్లవర్‌ సింబల్‌ను పోస్ట్ చేస్తూ ఫోటోలు షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పలువురు సినీతారలు సైతం బ్యూటీ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ ఫోటోలకు అక్కినేని కోడలు శోభిత ధూళిపాల, ఆదిరావు హైదరీ, సోనాక్షి సిన్హా, అమీ జాక్సన్ లాంటి అగ్ర సినీతారలు రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం అతియా శెట్టి బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. 

(ఇది చదవండి: గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేఎల్‌ రాహుల్‌)

కాగా.. ఈ ఏడాది జనవరి 23 తమ రెండో వివాహా వార్షికోత్సవాన్ని గ్రాండ్‌ సెలబ్రేట్ చేసుకున్నారు కేఎల్ రాహుల్- ‍అతియా జంట. 2023లో పెళ్లి పీటలెక్కిన వీరిద్దరు దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు. చివరికీ పెద్దల అంగీకారంలో వివాహాబంధంలోకి ‍అడుగుపెట్టారు. ఆమె తండ్రి, ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి తన ముంబయిలోని తన ఫామ్‌హౌస్‌లోనే వీరి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకలో బాలీవుడ్ తారలు, క్రీడా ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

 

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)