Breaking News

క్రికెటర్‌ కెఎల్‌ రాహుల్‌తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అతియా శెట్టి

Published on Sat, 05/07/2022 - 12:58

Athiya Shetty Response on Her Marriage Rumours With KL Rahul: ప్రముఖ సీనియర్‌ నటుడు సునీల్‌ శెట్టి ముద్దుల తనయ, బాలీవుడ్‌ బ్యూటీ అతియా శెట్టి, క్రికెటర్‌ కెఎల్‌ రాహుల్‌ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి ఉండేందుకు ముంబైలో బ్రాండ్‌ న్యూ హోం కొనుగోలు చేసినట్లు కూడా వార్తలు ​గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్‌తో పెళ్లి వార్తలపై స్పందించింది హీరోయిన్‌ అతియా శెట్టి. ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించిన అతియాకు రాహుల్‌తో డేటింగ్‌, పెళ్లి రూమర్స్‌పై ప్రశ్న ఎదురైంది. ఇది విని ఆమె ఒక్కసారిగా నవ్వింది. 

చదవండి: డెలివరీ తర్వాత ఫస్ట్‌ ఫోటో షేర్‌ చేసిన కాజల్‌

అనంతరం ‘దీనిపై నేను ఎలాంటి కామెంట్‌ చేయలేను. ఈ రూమర్స్‌ విని విని విసిగిపోయా. ఇక ఈ వార్తలకు నేను నవ్వుకోవడం తప్ప ఇంకేం చేయలేను. ప్రజలకు ఎలా అనిపిస్తే అలా అనుకోవివ్వండి. వారికి నచ్చినట్టుగా వారు ఆలోచిస్తున్నారు’ అని బదులిచ్చింది. అలాగే రాహుల్‌తో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్‌ అవుతున్న వార్తలపై కూడా ఆమె స్పందించింది. ‘నేను కొత్త ఇంటికి మారుతున్న విషయం వాస్తవమే. కానీ ఎవరితోనో కాదు. నా కుటుంబంతోనే. త్వరలోనే మా అమ్మ-నాన్న(మన శెట్టి-సునీల్‌ శెట్టి)తో పాటు నా సోదరుడుతో కలిసి ముంబై బాద్రాలోని కొత్త ఇంటికి మారబోతున్నా’ అని చెప్పుకొచ్చింది.

చదవండి: అప్పుడే ఓటీటీకి ‘అశోకవనంలో అర్జున కల్యాణం’, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

కాగా గత మూడేళ్లుగా కెఎల్‌ రాహుల్‌, అతియాలు సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే వారి రిలేషన్‌ను ఆఫిషియల్‌ చేశారు ఈ జంట. కెఎల్‌ రాహుల్‌ బర్త్‌డే సందర్భంగా 'ఎక్కడైనా నీతోనే.. హ్యాపీ బర్త్‌డే' అని అతియా పోస్ట్ షేర్‌ చేసింది. దీంతో త్వరలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటవ్వబోతున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇటీవల పింక్‌ విల్లా తన కథనంలో రాహుల్‌ అతియాలు ముంబైలోని సుమద్రం పక్కన, బాంద్రా కార్టర్‌ రోడ్‌లో 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారని, ఈ అపార్ట్‌మెంట్‌ అద్దె నెలకు రూ. 10 లక్షలు అని తెలుస్తోంది అంటూ ప్రచురించింది. పెళ్లి తర్వాత వారు అక్కడే స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారని కూడా పేర్కొంది. 

Videos

మహారాష్ట్ర థానేలో కోవిడ్ తో 21 ఏళ్ల యువకుడు మృతి

ఎన్టీఆర్ తో శృతి హాసన్..?

కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ.. కవితకు నో ఎంట్రీ..!

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై శ్యామల కామెంట్స్

చంద్రబాబు, లోకేష్ చెప్పినట్లు కొందరు పోలీసులు పని చేస్తున్నారు

ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర

జగన్ పొదిలి పర్యటన.. టీడీపీ నేతలకు చెమటలు

కవిత లేఖపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

Photos

+5

అమ్మ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన హీరోయిన్‌ లయ.. ఫోటోలు

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)