Breaking News

గొప్పమనసు చాటుకున్న అతియా శెట్టి- కేఎల్ రాహుల్ దంపతులు!

Published on Sat, 08/03/2024 - 18:01

బాలీవుడ్ భామ, హీరోయిన్ అతియా శెట్టి బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్‌లో కొద్ది సినిమాలే చేసినా.. గతేడాది క్రికెటర్‌ కేఎల్ రాహుల్‌తో పెళ్లి  తర్వాత మరింత ఫేమస్ అయింది. అయితే తాజాగా తన భర్తతో కలిసి ఓ ఛారిటీని స్థాపించింది ముద్దుగుమ్మ. విప్లా ఫౌండేషన్ కోసం నిధులను సేకరించేందుకు  'క్రికెట్ ఫర్ ఎ కాజ్' పేరుతో ఛారిటీని ప్రకటించారు. కాగా... ముంబయిలో సేవ్ ది చిల్డ్రన్ ఇండియాగా పిలువబడే సంస్థను ఆ తర్వాత విప్లా ఫౌండేషన్‌గా మార్చారు. మరికొందరు క్రికెటర్లతో కలిసి ఛారిటీ తరఫున నిధులు సమీకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వేలం పాట నిర్వహించనున్నట్లు తెలిపారు.  

ఈ సందర్భంగా అతియా మాట్లాడుతూ.. 'విప్లా ఫౌండేషన్ నా చిన్నతనంలోనే ఓ ముఖ్యమైన భాగం. నేను స్కూల్ అయిపోయిన తర్వాత చాలా రోజుల పాటు ఇక్కడ పిల్లలకు పాఠాలు బోధిస్తూ వారితో గడిపేదాన్ని. మేము నిర్వహించే వేలం ద్వారా వినికిడి లోపం, వైకల్యం ఉన్న పిల్లల అవసరాలను తీర్చాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టాం. విప్లా ఫౌండేషన్‌ను ప్రారంభించిన నాని వారసత్వాన్ని కొనసాగించాలనేదే నా ఆశయం'అని తెలిపారు.

కేఎల్ రాహుల్ మాట్లాడుతూ..' ఇలాంటి పాఠశాలకు మొదటిసారి రావడం చాలా ఉద్వేగభరితంగా అనిపించింది. అతియా కుటుంబం భాగమైన ఈ గొప్ప పనికి సహకరించడానికి ఈ పిల్లలే నన్ను ప్రేరేపించారు. వీరికి అన్ని రకాలుగా తోడ్పాటు అందించడంలో విప్లా ఫౌండేషన్ చేస్తున్న అద్భుతమైన పనికి మద్దతు ఇవ్వడానికి వేలం నిర్వహిస్తున్నాం. నేను నాతోటి క్రికెట్ సోదరులను సంప్రదించినప్పుడు.. వారు తమ విలువైన క్రికెట్ వస్తువులను వేలం ద్వారా వచ్చే డబ్బును విరాళం ఇచ్చేందుకు సహకరించారు. వేలంలో పాల్గొని ప్రత్యేకమైన ఈ పిల్లల జీవితాల్లో మార్పు తీసుకురావడం కోసం మాతో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.' అని అన్నారు.

కాగా.. అతియా శెట్టి, కేఎల్ రాహుల్ జనవరి 23, 2023న వివాహం చేసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అతియా చివరిసారిగా 2019 చిత్రం 'మోతీచూర్ చక్నాచూర్'లో కనిపించింది. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఆమె 2015లో వచ్చిన 'హీరో'లో మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా అర్జున్ కపూర్ నటించిన 'ముబారకన్' చిత్రంలోనూ నటించింది.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)