Breaking News

అషురెడ్డి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు

Published on Fri, 05/01/2026 - 10:38

నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి.. లండన్‌కి చెందిన ధర్మేంద్ర అనే ఎన్నారై నుంచి రూ.9.5 కోట్లు తీసుకుని మోసం చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ధర్మేంద్ర తండ్రి.. హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు.. ఈమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఈమె.. తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించింది. సోమవారం తదుపరి విచారణ జరగనుంది. ఈ క్రమంలోనే హైకోర్టు.. మీడియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన నోట్‌ని అషు.. తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.

(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న నారా రోహిత్.. వీడియో వైరల్)

'గత కొన్నిరోజుల నుంచి నాపై మీడియా, సోషల్ మీడియా, కంటెంట్ క్రియేటర్స్ నిరాధార కథనాలు ప్రసారం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం నాపై వచ్చిన ఆరోపణల కేసు.. కోర్టు పరిధిలో ఉంది. నా పరువుకు భంగం కలిగించే కంటెంట్ ప్రసారం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇది గౌరవించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా ప్రైవసీకి భంగం కలిగించొద్దని మీడియా, నెటిజన్లని కోరుతున్నా. కోర్టు ఆదేశాల మేరకు నాపై ఉన్న అభ్యంతరకర పోస్టులు తొలగించాలని, కొత్తవి పబ్లిష్ చేయకుండా సహకరించాలని కోరుతున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్స్. రూల్స్ పాటించని వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయి' అని అషురెడ్డి చెప్పుకొచ్చింది.

ఇకపోతే ఈ కేసు విషయం బయటకొచ్చిన తర్వాత తామేం తప్పు చేయలేదని అషురెడ్డి, ఈమె తండ్రి వెంకటకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. కానీ అషురెడ్డి మాట్లాడినట్లు ఓ ఆడియో బయటకొచ్చింది. ఇందులో మే నెల వరకు టైమ్ ఇస్తే కోటిన్నర తిరిగి ఇచ్చేస్తా, మిగిలిన డబ్బులు జీవితంలో స్థిరపడినప్పుడు ఇచ్చేస్తా అని ధర్మేంద్రతో మాట్లాడుతున్నట్లు ఉంది. మరోవైపు ధర్మేంద్రకు సంబంధించిన ఆరు నిమిషాల ఆడియో కూడా వైరల్ అవుతోంది. ఇందులో ఇతడు మాట్లాడుతూ అప్పు చేసి మరీ అషురెడ్డికి డబ్బులిచ్చానని.. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడం వల్లే కేసు పెట్టాల్సి వచ్చిందని మాట్లాడినట్లు ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ సినిమా.. 44 ఏళ్ల తర్వాత తొలిసారి స్ట్రీమింగ్)

Videos

ట్రంప్ పై దాడి Live వీడియో.. ఇలా వచ్చాడు.. అలా కాల్చాడు

వివాదంలో పంజాబ్ సీఎం.. మద్యం సేవించి అసెంబ్లీకి..?

పాలకొల్లులో అరుదైన ఘటన.. పది ఫలితాల్లో తల్లీకొడుకులు ఒకే సారి పాస్

ఆరుగురితో కాదు 36 మందితో చాటింగ్.. సీతారాం పెన్ డ్రైవ్ లో సంచలనాలు..

భార్య పాపులారిటీ తట్టుకోలేక నరికి చంపిన భర్త

బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే ప్రేమ..?

ఖమ్మం రాము మర్డర్ కేసులో వీడని మిస్టరీ

వేధింపుల్లో బాబు కొత్త ట్రెండ్

మన్యం జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

EVMల టాంపరింగ్.. బెంగాల్లో షాకింగ్ వీడియో

Photos

+5

ప్రెగ్నెన్సీతో మ్యాడ్ స్క్వేర్‌ బ్యూటీ రెబా మోనికా జాన్ (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటి మీనా వాసు మ్యారేజ్ డే.. భర్తకు స్పెషల్ విషెస్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో వరలక్ష‍్మి శరత్‌కుమార్‌ (ఫొటోలు)

+5

గ్లామర్ ఓవర్‌లోడెడ్.. మెరిసిపోతున్న కియారా (ఫొటోలు)

+5

సెలబ్రేషన్స్, డివోషనల్ ట్రిప్స్.. అల్లు స్నేహ ఏప్రిల్ గడిచిందిలా (ఫొటోలు)

+5

కూవాగంలో హిజ్రాల పెళ్లి సందడి..ఎందుకో తెలుసా? (ఫొటోలు)

+5

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి HD ఫొటోలు

+5

భారీ వర్షం : బెంగళూరు అతలాకుతలం (ఫొటోలు)

+5

తిరుచానూరు : వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు (ఫోటోలు)

+5

మల్లెపూల దండలతో సురేఖవాణి బర్త్ డే వేడుక.. ఢిఫరెంట్‌ లుక్‌లో కనిపించిన నటి (ఫోటోలు)