Breaking News

23 ఏళ్ల ప్రేమ.. గుళ్లో పెళ్లి చేసుకున్న సీరియల్‌ జంట

Published on Mon, 11/24/2025 - 10:26

బుల్లితెర జంట అశ్లేష సావంత్‌ (Ashlesha Savant)- సందీప్‌ బస్వాన (Sandeep Baswana) పెళ్లిపీటలెక్కారు. వీళ్లది రెండు మూడేళ్ల ప్రేమ కాదు.. ఏకంగా 23 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇన్నాళ్లకు తమ ప్రేమబంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. ఈమేరకు తమ వివాహ ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని బృందావన్‌ చంద్రోదయ ఆలయం ఈ పెళ్లికి వేదికగా మారింది.

ఆ గుడికెళ్లాకే..
నవంబర్‌ 16న ఈ పెళ్లి జరగ్గా ఆలస్యంగా బయటకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సందీప్‌ మాట్లాడుతూ.. అశ్లేష, నేను ఏప్రిల్‌లో బృందావనానికి వెళ్లాం. అక్కడి రాధాకృష్ణుడి గుడి మమ్మల్ని కట్టిపడేసింది. ఆ ట్రిప్‌ తర్వాతే పెళ్లి చేసుకోవాలన్న కోరిక పుట్టింది. 23 ఏళ్లుగా జంటగా ఉన్న మేము అలా వైవాహిక జీవితంలో అడుగుపెట్టాం. 

అలా మొదలైంది
మా పేరెంట్స్‌ ఈ శుభవార్త కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. సింపుల్‌గా మా పెళ్లి జరుపుకున్నాం. కృష్ణుడి గుడిలో వెడ్డింగ్‌ జరగడం కన్నా ఉత్తమమైనది ఇంకేముంటుంది? అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అశ్లేష వయసు 41 కాగా, సందీప్‌ వయసు 47. వీరిద్దరూ 2002లో వచ్చిన 'క్యూంకీ సాస్‌బీ కభీ బహుతీ' సీరియల్‌లో కలిసి నటించారు. కొన్నిసార్లు షూటింగ్‌ ఆలస్యమైనప్పుడు అశ్లేష తన ఇల్లు దూరంగా ఉండటంతో సందీప్‌ ఇంటికి వెళ్లి అక్కడే బస చేసేది. 

సీరియల్స్‌
అలా వీరిమధ్య బంధం మొదలైంది. చాలా ఏళ్లుగా వీరు కలిసే జీవిస్తున్నారు. ప్రస్తుతం అశ్లేష.. జనక్‌ సీరియల్‌ చేస్తోంది. గతంలో అనుపమ సీరియల్‌లో నెగెటివ్‌ పాత్ర పోషించింది. సందీప్‌ చివరగా 'అపొల్లెనా- సప్నోకీ ఉంచి ఉడాన్‌' సీరియల్‌లో కనిపించాడు.

 

 

చదవండి: బిగ్‌బాస్‌9: 12వ వారం నామినేషన్స్‌లో ఎవరంటే?

Videos

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు