Breaking News

ఇంట్లో కూర్చుని బాధపడలేను.. ఇకపై అలాంటి సినిమాలే చేస్తా!

Published on Fri, 08/08/2025 - 13:39

సరైన పాత్రలు ఆఫర్‌ చేస్తేనే సినిమాలు చేస్తానంటున్నాడు ప్రముఖ నటుడు ఆశిష్‌ విద్యార్థి (Ashish Vidyarthi). తెలుగు, తమిళ, బెంగాలీ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసి విశిష్ట నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆశిష్‌ విద్యార్థి. ఈయన చివరగా కిల్‌, ఆవేశం చిత్రాల్లో నటించాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఆశిష్‌ విద్యార్థి మాట్లాడుతూ.. కొన్ని విషయాలు ఈరోజు చర్చించి తీరాల్సిందే! ప్రేక్షకులుగా మీరెప్పుడూ కరెక్టే! 

గ్రేట్‌ యాక్టర్‌ను
ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ సినిమాలు చేయడం లేదు. అందరు కాకపోయినా కొందరైనా దానికి గల కారణం తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నారు. వారికోసమైనా నేను నోరు విప్పాల్సిందే! నేను గ్రేట్‌ యాక్టర్‌ని. కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశాను. అయితే ఇంతవరకు చేయని పాత్రల కోసం వెయిట్‌ చేస్తున్నాను. కథలో కీలక పాత్రలు ఆఫర్‌ చేస్తే తప్పకుండా యాక్ట్‌ చేస్తాను. ఈ విషయాన్నే దర్శకనిర్మాతలకు చెప్పాను.

11 భాషల్లో నటించా..
నా 30 ఏళ్ల కెరీర్‌లో 300 సినిమాలు చేశాను. 11 భాషల్లో నటించాను. ఇప్పుడు కొత్తదనం కావాలనుకుంటున్నాను. ప్రధాన పాత్రలే చేయాలనుకుంటున్నాను. కొన్నిసార్లు మనం ప్రపంచానికి దూరంగా ఉంటాం. కానీ, అలా అందరికీ దూరంగా ఉండి.. ఇంట్లో కూర్చుని ఒత్తిడికి లోనయ్యే టైప్‌ కాదు నేను అని చెప్పుకొచ్చాడు. కాగా ద్రోహకాల్‌ సినిమాకుగానూ ఆశిష్‌ ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే!

చదవండి: మొన్న నేషనల్ అవార్డ్.. ఇప్పుడు తెలుగు సింగర్ నిశ్చితార్థం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)