Breaking News

ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తితో వివాహం.. అందుకే సీక్రెట్‌గా..: నటి

Published on Sun, 04/07/2024 - 15:45

బాబీ, రోటి కపడా ఔర్‌ మకాన్‌, రాకీ, లవ్‌ స్టోరీ, బేటా, కర్తవ్య.. ఇలా పలు హిందీ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించింది అరుణ ఇరానీ. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన ఆమె తర్వాతి కాలంలో సహాయక పాత్రలతో ఫేమస్‌ అయింది. సినిమాలే కాకుండా సీరియల్స్‌ కూడా చేసింది. తాజాగా ఆమె అరుణ ఇరానీ ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. 'కోహ్రాం సినిమా షూటింగ్‌లో తొలిసారి డైరెక్టర్‌ కుకును కలిశాను. అప్పటికే నా ఇల్లు గడవడం కోసం చాలా సినిమాలు చేస్తున్నాను. కానీ అవేమీ పెద్దగా గుర్తింపు ఉన్న పాత్రలు కావు.

ఒకరంటే ఒకరికి కోపం
చెన్నైలో సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో కుకు ఓ నెలరోజులపాటు నా డేట్స్‌ అడిగారు. సరేనని సినిమాలో భాగమయ్యాను. అయితే బిజీ షెడ్యూల్స్‌ వల్ల అన్నీ మేనేజ్‌ చేయలేకపోయాను. నా వల్ల కావడం లేదని, వేరే ఆప్షన్‌ చూసుకోమని చెప్పాను. అప్పుడు కుకుకి విపరీతమైన కోపం వచ్చింది. నాపై సీన్లు ఉన్నా, లేకపోయినా నాకు కొన్ని డేట్స్‌ ఇచ్చి రమ్మనేవారు. నాపై సీన్‌ షూట్‌ లేనప్పుడు ఎందుకు రమ్మంటున్నారని కోపమొచ్చింది. ఒక్కోసారైతే రోజంతా కూర్చోబెట్టి ఒక చిన్న షాట్‌ తీసేవారు. ఆయనను చూస్తేనే ఒళ్లు మండిపోయింది. తనకు కూడా నేనంటే అంతే కోపం ఏర్పడింది.

ప్రేమలో పడిపోయాం
ఏమైందో తెలీదు కానీ ఉన్నట్లుండి సాఫ్ట్‌గా మారిపోయాడు. కూల్‌గా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇద్దరం ఫ్రెండ్స్‌ అయిపోయాం. అప్పుడు తనే నా డేట్లు అడ్జస్ట్‌ చేశాడు. అలా మేము ప్రేమలో పడ్డాం.. పెళ్లి చేసుకున్నాం. కానీ ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. ఎందుకంటే అతడికి ఆల్‌రెడీ పెళ్లయింది. నాకు ఆ విషయం తెలియదని అంతా అనుకున్నారు. అతడి భార్య, పిల్లలు సెట్స్‌కు వచ్చేవారు.. కాబట్టి తనకు ఇదివరకే ఓ కుటుంబం ఉందని నాకు ముందే తెలుసు. అయినా సరే కలిసుండాలనుకున్నాం. అందరితో పోరాడి మరీ అతడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. అయితే పిల్లల్ని వద్దనుకున్నాం.. ఈ నిర్ణయం తీసుకోవడమే మేము చేసిన పెద్ద తప్పు' అని చెప్పుకొచ్చింది.

చదవండి: పాతికేండ్లుగా సినిమాలకు దూరం.. రీఎంట్రీపై తెలుగు హీరోయిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)