Breaking News

ఇద్దరు పిల్లలు పుట్టాక పెళ్లికోసం ప్లానింగ్‌!

Published on Sun, 12/14/2025 - 15:51

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ తన ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందని వెల్లడించాడు. ప్రియురాలు గాబ్రియెల్లా డెమట్రాయిడ్స్‌తో తన నిశ్చితార్థం జరిగిందని తెలిపాడు. ఈ విషయాన్ని రియా చక్రవర్తి చాప్టర్‌ 2 అనే పాడ్‌కాస్ట్‌లో వెల్లడించాడు. ఈ పాడ్‌కాస్ట్‌కు అర్జున్‌ ప్రేయసి గాబ్రియెల్లాతో కలిసి హాజరయ్యాడు. మాకింకా పెళ్లి కాలేదు. 

 ఆరేళ్లుగా డేటింగ్‌
అదెప్పుడు జరుగుతుందో ఎవరికి తెలుసు? అని గాబ్రియెల్లా అంది. అందుకు అర్జున్‌ వెంటనే.. కాకపోతే మా నిశ్చితార్థం మాత్రం జరిగిపోయింది అన్నాడు. అలా నిశ్చితార్థం విషయాన్ని తొలిసారి బయటపెట్టారు. అంటే ఆరేళ్లుగా డేటింగ్‌ చేసుకుంటున్న వీరు ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారన్నమాట!!

మొదటి పెళ్లి
కాగా అర్జున్‌ రాంపాల్‌.. 1998లో నిర్మాత మెహర్‌ జెసియాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం. దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2018 మేలో భార్యాభర్తలు విడిపోతున్నట్లు ప్రకటించారు. మరుసటి ఏడాది విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది నటి గాబ్రియెల్లాతో ప్రేమలో పడటంతో పాటు ఆమెను గర్భవతిని చేశాడు అర్జున్‌. అలా పెళ్లికి ముందే వీరు తల్లిదండ్రులు కూడా అయ్యారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు సంతానం.

ఎవరీ గాబ్రియెల్లా?
గాబ్రియెల్లా 16 ఏళ్లకే మోడలింగ్‌ చేసింది. పలు మ్యూజిక్‌ వీడియోల్లో నటించింది. ఇష్క్‌ ఝమేలా అనే హిందీ మూవీలో అర్జున్‌-గాబ్రియెల్లా కలిసి నటించారు. తెలుగులో ఊపిరి మూవీలో ఫ్రెంచ్‌ డ్యాన్సర్‌గా గాబ్రియెల్లా అలరించింది. ఇక అర్జున్‌ రాంపాల్‌ విషయానికి వస్తే.. ఆంఖేన్‌, డాన్‌, ఓం శాంతి ఓం, ఈఎమ్‌ఐ, హౌస్‌ఫుల్‌, రాజ్‌నీతి, చక్రవ్యూహ్‌, సత్యాగ్రహ, ధాకడ్‌, ధురంధర్‌ వంటి పలు హిందీ సినిమాలు చేశాడు. తెలుగులో భగవంత్‌ కేసరి చిత్రంలో నటించాడు.

చదవండి: రెండోసారి విడాకులు తీసుకోబోతున్న దర్శకుడు!

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)