Breaking News

స్టార్ హీరోయిన్‌ బర్త్‌ డే.. విషెస్ చెప్పిన మాజీ ప్రియుడు!

Published on Thu, 10/23/2025 - 15:52

బాలీవుడ్ భామ మలైకా అరోరా ఇటీవలే థామా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రంలో పాయిజన్ బేబీ పాట అనే ఐటమ్ సాంగ్‌తో ‍అలరించింది. అంతేకాకుండా ఆమె ఇండియాస్ గాట్ టాలెంట్ అనే రియాలిటీ సిరీస్‌లో జడ్జిగా వ్యవహరిస్తోంది బాలీవుడ్ ముద్దుగుమ్మ. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇవాళ 53వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా పలువురు సినీతారలు మలైకాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మలైకా పుట్టినరోజున ఆమె మాజీ ప్రియుడు అర్జున్‌ కపూర్ సైతం బర్త్‌ డే విషెస్ చెప్పారు. ఆమె ఫోటోను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్‌డే మలైకా.. మీరు ఎప్పుడు ఇలాగే ఎగురుతూ.. నవ్వుతూ ఉండాలి.. అంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసిన మలైకా తన మాజీ ప్రియుడి పోస్ట్‌కు రిప్లై కూడా ఇచ్చింది.  ధన్యవాదాలు అంటూ లవ్ సింబల్‌ ఎమోజీని జతచేసింది. కాగా.. ఈ ఏడాది జూన్‌లో అర్జున్ కపూర్‌ పుట్టినరోజున.. మలైకా సోషల్ మీడియా ద్వారా అర్జున్‌కు శుభాకాంక్షలు తెలిపింది.

అర్జున్‌ కపూర్‌తో డేటింగ్..

మలైకా అరోరా- ‍అర్జున్ కపూర్‌ 2018లో డేటింగ్ ప్రారంభించారు. దాదాపు ఆరేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న వీరిద్దరు గతేడాది విడిపోయినట్లు తెలిసింది. దీపావళి సందర్భంగా ఓ ఈవెంట్‌లో మాట్లాడిన అర్జున్‌ కపూర్‌.. తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానంటూ మలైకాతో బ్రేకప్‌పై క్లారిటీ ఇచ్చాడు. అయితే గతేడాది  సెప్టెంబర్‌లో ఆమె తండ్రి అనిల్ మెహతా మరణించిన తర్వాత అర్జున్ కపూర్‌ ఆమెను ఇంటికెళ్లి పరామర్శించాడు. ఇటీవలే వీరిద్దరు ముంబయిలో జరిగిన హోమ్‌బౌండ్ ప్రీమియర్‌ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒకరినొకరు హృదయపూర్వకంగా చిరునవ్వుతో పలకరించుకున్నారు.

అర్బాజ్‌ ఖాన్‌తో పెళ్లి- విడాకులు..

కాగా.. మలైకా అరోరా గతంలో అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. 1998లో వివాహం చేసుకున్న ఈ జంటకు అర్హాన్ అనే కుమారుడు ఉన్నాడు. వీరిద్దరు 2016లో విడిపోతున్నట్లు ప్రకటించి.. 2017లో విడాకులు తీసుకున్నారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)