Breaking News

బేబి సినిమాలో హీరోగా ట్రై చేశా.. కానీ డైరెక్టర్‌ ఆ మాటనడంతో బాధేసింది!

Published on Wed, 08/30/2023 - 12:49

ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌, యూట్యూబర్‌ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బేబి. సాయి రాజేశ్‌ మొదట ఈ సినిమా కథను ఓ హీరోకు చెప్పేందుకు ప్రయత్నించగా అతడు కథ వినడానికి కూడా సుముఖత వ్యక్తం చేయలేదన్న సంగతి తెలిసిందే! దీంతో ఈ సినిమా కథ ఆనంద్‌ దేవరకొండ దగ్గరకు వెళ్లింది. ఇకపోతే ఇందులో రెండో హీరోగా నటించిన విరాజ్‌ అశ్విన్‌ స్థానంలో తాను ఉండాల్సింది అంటున్నాడు నటుడు అర్జున్‌ కల్యాణ్‌.

తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'నాకు జరిగిన ఓ సంఘటన వల్లే నేను బిగ్‌బాస్‌కు వెళ్లాను. ఇటీవలి కాలంలో కల్ట్‌ క్లాసిక్‌గా నిలిచిన ఓ సినిమాలో(బేబి చిత్రాన్ని ఉద్దేశిస్తూ) రెండో హీరోగా ప్రయత్నించాను. హీరోయిన్‌ నా స్నేహితురాలు కావడంతో తను నన్ను రిఫర్‌ చేసింది. డైరెక్టర్‌ కూడా నా స్నేహితుడే! నేను నటించిన రెండు, మూడు సినిమాల ఫంక్షన్స్‌కు కూడా వచ్చాడు. అయితే అతడి సినిమాకు నేను ట్రై చేశాను. ఆయన మాత్రం.. అర్జున్‌.. నీకింకా మార్కెట్‌ లేదు. దాదాపు రూ.4 కోట్లతో సినిమా తీయాలనుకుంటున్నాం. ఈ చిత్రాన్ని తన పాపులారిటీతో ముందుకు తీసుకెళ్లగలిగే వ్యక్తి కావాలనుకుంటున్నాం అని రిజెక్ట్‌ చేశాడు.

ఇలా జరిగిందేంటని నిరాశపడ్డాను. అందుకే నేను బిగ్‌బాస్‌ షోకి వెళ్లాను. నాకంటూ మార్కెట్‌ సృష్టించుకోవాలనే షోలో పాల్గొన్నాను. సొంతంగా మార్కెట్‌ వచ్చేంతవరకు మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. కానీ సినిమాలు చేయకుండా మార్కెట్‌ ఎలా వస్తుంది? సినిమాలు చేస్తే కానీ మార్కెట్‌ రాదు, మార్కెట్‌ ఉంటే కానీ సినిమాలు రావు. మార్కెట్‌ లేకపోయినా సరే.. నా టాలెంట్‌ చూసి పెళ్లికూతురు పార్టీ, ప్లేబ్యాక్‌ సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ఆ డైరెక్టర్లకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను' అన్నాడు అర్జున్‌ కల్యాణ్‌.

చదవండి: జైలర్‌ సినిమాకు షాక్‌.. ఆన్‌లైన్‌లో HD ప్రింట్‌ లీక్‌.. కలెక్షన్స్‌కు దెబ్బ.. ఓటీటీలో..

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)