Breaking News

హీరోయిన్‌గా అర్జున్‌ కూతురు.. ‘సీతా పయనం’ ఎప్పుడంటే..?

Published on Fri, 02/06/2026 - 13:40

శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య  హీరోయిన్‌గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు.

ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటి వరకు వదిలిన కంటెంట్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేశారు. ఈ సినిమాను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తుండటంతో ప్రమోషనల్ కార్యక్రమాల్ని కూడా వినూత్నంగా చేపట్టారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి జి బాలమురుగన్ సినిమాటోగ్రఫీ అందించారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. చిత్రంలోని స్టంట్ సన్నివేశాలకు కిక్ యాస్ కాళీ కొరియోగ్రఫీ అందించారు.

ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పాజిటీవ్ బజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, ఫ్యామిలీస్ కు బాగా నచ్చే అనేక అంశాలు ఈ మూవీలో ఉండబోతున్నాయి,  త్వరలో సీతా పయనం ట్రైలర్ ను మేకర్స్ విడుదల చెయనున్నారు.

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)