Breaking News

డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఏం చెప్పినా చేస్తా: యువ నటుడు

Published on Mon, 05/06/2024 - 09:03

అర్జున్ దాస్.. ఈ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది అతడి గొంతు. బయపెట్టేలా ఉండే బేస్ వాయిస్‌ తనకు చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. 'ఖైదీ' మూవీలో విలన్‌గా చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతడు.. ఇప్పుడు హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. తాజాగా అలా తన కొత్త మూవీ 'రసవాది' రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

(ఇదీ చదవండి: శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా)

ఎక్కడో దుబాయ్‌లో పనిచేసే అర్జున్ దాస్.. చైన్నెకి వచ్చి డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ తీసిన 'ఖైదీ'తో యాక్టర్ అయ్యాడు. దీని తర్వాత 'మాస్టర్'లోనూ లోకేశ్ ఇతడికి ఛాన్స్ ఇచ్చాడు. అందుకే ఆయనంటే అర్జున్‌దాస్‌కు ప్రత్యేక అభిమానం. తాజాగా తన కొత్త మూవీ రిలీజ్ సందర్భంగా అర్జున్ దాస్‌ పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. విలన్‌గా చేసే మీరు ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. మళ్లీ విలన్‌గా నటించే అవకాశమొస్తే చేస్తారా? అన్న ప్రశ్నకు బదిలిస్తూ.. లోకేశ్‌ కనకరాజ్‌ విలన్‌గా చేయమని చెబితే కచ్చితంగా నటిస్తానని అన్నాడు.

డైరెక్టర్ లోకేశ్‌ తనకు మంచి మిత్రుడని, ఆయన అవకాశమిస్తే రజనీకాంత్‌ 'కూలీ'లో నటించడానికి రెడీ అని అర్జున్ దాస్ అన్నాడు. మళ్లీ డబ్బింగ్‌ చెప్పే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటి అవకాశం లేదని, లోకేశ్‌ కనకరాజ్‌ తన సినిమాలో డబ్బింగ్‌ చెప్పమంటే మాత్రం ఎలాంటి పాత్రకై నా చెబుతానని క్లారిటీ ఇచ్చేశాడు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)