సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ మూవీ

Published on Wed, 10/29/2025 - 13:52

కొన్ని పాత్రలు చేయాలంటే దమ్ముండాలి. అది మలయాళ హీరో అర్జున్‌ అశోక‌న్‌కు కావాల్సినంత ఉంది. అర్జున్‌ 'తలవర' సినిమా (Thalavara Movie)లో బొల్లి వ్యాధితో బాధపడే యువకుడిగా నటించాడు. ఈ వ్యాధి కారణంగా అనేక అవమానాలను ఎదుర్కొంటాడు. కుటుంబం నుంచి సమాజం వరకు తనకు ఎదురయ్యే అనుభవాల కథే తలవర. ఈ సినిమా మలయాళంలో ఆగస్టు 22న థియేటర్లలో విడుదలైంది. 

రెండు నెలల తర్వాత ఓటీటీలో
వసూళ్లు పెద్దగా రాలేదు కానీ కంటెంట్‌కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అఖిల్‌ అనిల్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీకి వచ్చింది. బుధవారం సడన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ప్రత్యక్షమైంది. తెలుగు డబ్బింగ్‌ లేదు, కేవలం మలయాళ భాషలోనే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌ ఉన్నాయి. ఈ సినిమాలో రేవతి శర్మ హీరోయిన్‌గా నటించింది. 

సినిమా
అశోకన్‌, దేవదర్శిని, అభిరామి రాధాకృష్ణన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కిలి, విజయానంద్‌ సంగీతం అందించారు. ఈ మూవీ రిలీజైన ఐదారు రోజులకే అక్కడ కల్యాణి ప్రియదర్శిని లోక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో తలవర సినిమా వెనకబడిపోయింది. తలవర కంటే ముందు అర్జున్‌ అశోకన్‌.. సుమతి వలవు సినిమాతో మెప్పించాడు. ఈ మలయాళ మూవీ దాదాపు రూ.25 కోట్లు రాబట్టింది.

 

 

చదవండి: మరోసారి పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి

Videos

ఎవరివైపు పబ్లిక్? చాణక్య సర్వేలో క్లారిటీ!

హిమాలయాలు కరుగుతున్నాయ్!

ధనుష్ పార్టీకిలోకి TVK మంత్రి..?

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Photos

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)