Breaking News

అర్జున్‌ అంబటి హీరోగా వెడ్డింగ్‌ డైరీస్‌.. ట్రైలర్‌ చూశారా?

Published on Wed, 08/21/2024 - 12:24

బిగ్‌బాస్‌ ఫేమ్ అర్జున్ అంబటి, చాందిని తమిలారసన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం వెడ్డింగ్ డైరీస్. ఎమ్ వి ఆర్ స్టూడియోస్ పతాకంపై డాక్టర్ మిద్దె విజయవాణి సమర్పణలో వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 23న విడుదల అవుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా చంద్రబోస్ గారు మాట్లాడుతూ "వెడ్డింగ్ డైరీస్ ట్రైలర్ చూశాను. చాలా ఆసక్తికరంగా ఉంది. పెళ్లి తర్వాత వచ్చే అపార్థాలు, అపోహలు శాశ్వతం కాదు. వైవాహిక బంధం మాత్రమే చిరకాలం ఉంటుందనే మంచి కథను తీసుకున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను" అన్నారు.

దర్శక నిర్మాత వెంకటరమణ మిద్దె మాట్లాడుతూ "దాంపత్య జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు, సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో ఈ మూవీ చూపిస్తుంది. రోజూ జరిగే గొడవలు, విభేదాలతో విసిగిపోయిన దంపతులు విడిపోవాలనుకుంటారు. కానీ తమ బంధం ఎంత విలువైనదో గుర్తించి మళ్లీ కలిసిపోవాలని నిర్ణయించుకుంటారు. ఆగస్టు 23న మహా మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తున్నాం" అని తెలిపారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)