Breaking News

డబ్బుల కోసం అలాంటి పని చేశా.. పేరు మార్చుకున్నా : అరియానా

Published on Sat, 12/27/2025 - 13:57

అరియానా గ్లోరీ.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఆర్జీవీని ఇంటర్వ్యూలో చేసి బోల్డ్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అరియానా, ఆ క్రేజ్‌తోనే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్‌గా ఎంపికైంది. బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పాల్గొని..తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఈ షో నుంచి బయటకు వచ్చన తర్వాత పలు వెబ్‌ సిరీస్‌లు, సినిమాలతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ బీజీ అయిపోయింది. తాజాగా ఈ బోల్డ్‌ బ్యూటీ ఓ టీవీ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌తో పర్సనల్‌ లైఫ్‌ గురించి ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకుంది.

అందుకే పేరు మార్చుకున్నా
నా అసలు పేరు అరియానా(Ariyana Glory) కాదు. మా అమ్మనాన్నలు నాకు అర్చన అని పేరు పెట్టారు. అయితే కష్టాలు ఎక్కువ అవ్వడంతో నేనే పేరు మార్చుకున్నా. అరియానా పేరుతో ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను.

అనుకోకుండా అవకాశం.. 
మన జీవితంలో ఏం జరగాలో ముందే రాసిపెట్టి ఉంటుంది. నేను అనుకోకుండా యాంకర్‌ అయ్యాను. ఒక రోజు నేను, మా చెల్లి టీవీ చూస్తుంటే.. యాంకర్స్‌ కావలెనన్న ప్రకటన వచ్చింది. అది చూసి నేను ఆడిషన్స్‌కి వెళ్లాను. అదృష్టం కొద్ది సెలెక్ట్‌ అయ్యాను. అక్కడ నుంచి చిన్న చిన్న అవకాశాలతో ఈ స్థాయికి చేరుకున్నాను.

ఒకేసారి ఐదారు జాబులు చేశా
డబ్బుల కోసం నేను రకరకాల జాబులు చేశా. లైన్‌లో నిలబడి పన్నీరు చల్లేందుకు కూడా వెళ్లాను. అప్పుడు నాకొచ్చే జీతం రూ. 1800 మాత్రమే. రూమ్‌ రెంట్‌ రూ. 3000. ఒకసారి అద్దె కట్టేందుకు డబ్బులు జమ చేయగా.. ఓ అమ్మాయి దొంగతనం చేసింది. దీంతో చాలా ఇబ్బంది పడ్డా.  డబ్బులు సరిపోకపోవడంతో ఒకేసారి ఐదారు జాబులు చేశా. ఇప్పుడు నేను బెటర్‌ పొషిషన్‌లో ఉన్నాను.

ఈ క్షణమైనా చనిపోవడానికి రెడీ
ఇక నీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ‘మా అమ్మ నన్ను క్రిస్టియన్‌లా పెంచింది. కానీ ఈ మధ్య నాకు సుబ్రహ్మణ్య స్వామి అంటే చాలా ఇష్టం పెరిగింది. ఆయన ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే.. నన్ను తీసుకెళ్లిపో అని చెబుతా. దేవుడే వచ్చి అడిగాక ఇంకేముంది?. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పటికిప్పుడు చనిపోయినా నాకు ఓకే’ అని అరియానా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చింది.  
 

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)