Breaking News

విశాల్‌ మాటలు చెత్తబుట్టలో వేయండి: హీరో

Published on Mon, 02/05/2024 - 10:10

ప్రముఖ గీత రచయిత ప్రియన్‌ కథానాయకుడిగా అవతారమెత్తి, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం అరణం. వర్ష హీరోయిన్‌గా నటించిన ఇందులో లఘుబరన్‌, కీర్తన ముఖ్య పాత్రలు పోషించారు. జనవరి 9వ తేదీన విడుదలైన ఈ మూవీ హిట్‌ టాక్‌తో 25 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ శనివారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది.

ఈ సినిమా చేయడం అవసరమా?..
ఈ వేదికపై చిత్ర కథానాయకుడు, దర్శకుడు ప్రియన్‌ మాట్లాడుతూ.. అరణం సక్సెస్‌ సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అంతేకాకుండా పలువురు చిన్న నిర్మాతలకు, కళాకారులకు కొత్త ధైర్యాన్ని అందించిందన్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు, ఇలాంటి సమయంలో ఈ చిత్రం చేయడం అవసరమా అని హెచ్చరించిన వారే ఇప్పుడు అభినందిస్తున్నారన్నారు. ఈ చిత్ర నిర్మాణం వెనుక చాలా సమస్యలు ఉన్నట్టు ఇంతకుముందు ఆడియో ఆవిష్కరణ వేదికపైనే చెప్పానని అదేవిధంగా అరణం విజయాన్ని సాధిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశానని, ఇప్పుడదే నిజమైందన్నారు.

విశాల్‌ మాట విని వెనక్కు వెళ్లిపోయారు
ఈ చిత్ర నిర్మాణంలో తాను చాలా నేర్చుకున్నానన్నారు. కొన్ని చిత్రాలు విడుదలైన వారంలోనే వేడుకలను జరుపుకుంటున్నప్పుడు, 25 రోజులుగా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న తమ చిత్రానికి వేడుకలు ఎందుకు జరుపుకోకూడదన్నారు. మూడు, నాలుగు కోట్ల రూపాయలతో చిత్రాలు చేయడానికి నిర్మాతలు రావొద్దని విశాల్‌ చెప్పడంతో చాలామంది తిరిగి వెళ్లిపోయారన్నారు. కానీ హీరోలను కాకుండా కథను నమ్మి చిత్రాలు చేస్తే విజయం తథ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విశాల్‌ వ్యాఖ్యలను చెత్తబుట్టలో వేయండన్నారు. సినిమాను సినిమా వాళ్లే చంపేస్తున్నారని ఆరోపించారు.

చదవండి: మేము ప్రశ్నిస్తే.. అన్నింటికీ సిద్ధపడే ఈ వృత్తిలోకి వచ్చారు కదా అంటున్నారు: రష్మిక

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)