Breaking News

20 ఏళ్ల తర్వాత ఇళయరాజా ఎలాంటివారో రివీల్‌ చేసిన సింగర్‌

Published on Sat, 06/24/2023 - 11:05

చిన్న చిన్న ఆశ- ఈ ఒక్క పాట చాలు మిన్‌మిని గుర్తుపెట్టుకోవడానికి. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1992లో ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకుడిగా 'రోజా' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అతనికి మొదటి సినిమా అయినా కూడా సుశీల, జానకి, చిత్ర వంటి సీనియర్లను పక్కనపెట్టి  ‘చిన్ని చిన్న ఆశ’ పాటను  కొత్త గాయని 'మిన్మిని'ని ఎంచుకున్నాడు. ఆ సినిమా తెలుగు, తమిళ, హిందీ వెర్షన్‌లకు మిన్‌మినియే పాడింది. ‘జాబిలిని తాకి ముద్దులిడ ఆశ... వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ’... అంటూ సాగిన ఆ పాట ఆ  సినిమాకే ఊపిరి పోసింది.

కానీ ఆ పాట తర్వాత మిన్‌మికి మాత్రం ఎలాంటి అవకాశాలు రాలేదు. 1991 నుంచి 1994 వరకు పలు సూపర్‌ హిట్‌ పాటలు పాడిన తన కెరీర్‌ ఎందుకు ముగిసిందో తాజాగా  మిన్‌మిని వెల్లడించింది. 

(ఇదీ చదవండి: కేపీ చౌదరితో సురేఖా వాణి కూతురి ఫోటో వైరల్)


రోజా సినిమాలోని పాట పాడక ముందే తను మాస్ట్రో ఇళయరాజా టీమ్‌లో ప్లేబ్యాక్‌ సింగర్‌గా కొనసాగేదట. ఎప్పుడైతే తను ఏఆర్‌ రెహమాన్‌ మొదటి సినిమాలో పాట పాడినట్లు ఇళయరాజాకు తెలియగానే  వేరేచోట ఎందుకు పాడుతున్నారు? తన దగ్గరే పాడాలని ఇళయ రాజా అన్నట్లుగా గుర్తు చేసుకుంది. దీంతో తాను ఏడ్చానని.. ఇదంతా ఒక రికార్డింగ్ స్టూడియోలో ఉండగానే జరగడంతో అక్కడున్న వారంతా తన ఏడుపును విన్నట్లు చెప్పింది. అప్పుడు సింగర్ మనో తనను ఓదార్చారని  తెలిపింది 

(ఇదీ చదవండి: డ్రగ్స్‌ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి)

ఆ సంఘటన తర్వాత పాటలు పాడేందుకు ఇళయ రాజా పిలవలేదని మిన్మిని చెప్పుకొచ్చింది . ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న ఆయన గురించి ఎవరూ నెగెటివ్‌గా ఆలోచించకూడదనే ఇన్నాళ్లు ఈ విషయాన్ని రివీల్ చేయలేదని వెల్లడించింది. మరోవైపు కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే ఈ ఒక్క కారణంతో అవకాశాలు కోల్పోయానని మిన్మిని పేర్కొంది..అయితే లక్కీగా 2015లో మళ్లీ ఏఆర్‌ రెహమాన్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చినట్లు తెలిపింది. కానీ అప్పటికే తనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో పాటలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని తెలిపింది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)