Breaking News

ఏఆర్ రెహమాన్ విడాకులకు కారణం తెలిపిన అడ్వకేట్‌.. పిల్లల కామెంట్స్‌

Published on Wed, 11/20/2024 - 11:28

మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్, భార్య సైరా బాను విడిపోయారు. వారిద్దరూ ఇలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? అనే ప్రశ్నలు చాలామందికి వస్తున్నాయి. 1995లో వారు పెళ్లి చేసుకున్నారు. సుమారు 29 ఏళ్లు కలిసి జీవించిన వారు ఇలా విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదే విషయంపై వారి పిల్లలు కూడా సోషల్‌మీడియా వేదికగా స్పందించారు.

ఎందుకు విడిపోయారంటే..
ఏఆర్ రెహమాన్, సైరా బాను విడిపోవడానికి ఉన్న కారణాలను వారి అడ్వకేట్‌ వందనా షా ఇలా చెప్పారు. 'భావోద్వేగపూరిత ఒత్తిడి కారణంగానే వారు విడిపోయారు.  దంపతుల మధ్య సంబంధాల సమస్యలే ఈ నిర్ణయానికి దారితీశాయి. ఇరువురి మధ్య గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, ఈ జంట తమ మధ్య వచ్చే చిన్నచిన్న విభేదాలు, పోరాటాల విషయంలో పరిష్కరించుకోలేకపోయారు. అవి వారి మధ్య అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయ. శ్రీమతి సైరా చాలా బాధ, వేదనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తమ గోప్యతను, గౌరవాన్ని ప్రజలు కాపాడాలని వారిద్దరూ కోరారు.' అని న్యాయవాది తెలిపారు.

విడాకులపై పిల్లల కామెంట్స్‌
29 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎప్పుడూ సంతోషంగా కనిపించే ఈ జంట తమ వివాహ బంధాన్ని ముగించుకున్నారని తెలుసుకున్న అభిమానులు, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. రెహమాన్, సైరా ఇద్దరూ కలిసే బాలీవుడ్ పార్టీలు, అవార్డులు, సెలబ్రిటీల వివాహాలకు  హాజరవుతారు. ముంబైలో జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహ వేడుకలో వారు చివరిసారిగా కలిసి కనిపించారు.

విడాకుల విషయంపై వారి పిల్లలు ఖతీజా, రహీమా, అమీన్‌ స్పందిస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. 'మా తల్లిదండ్రుల విడాకుల విషయంలో మీరందరూ గోప్యత పాటించి గౌరవంగా వ్యవహరించారు. అందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు' అంటూ రహీమా  పోస్ట్‌ చేయగా..

ఖతీజా ఇలా తెలిపింది. ' ఇలాంటి కష్ట సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని అందరినీ వేడుకుంటున్నాం. మా బాధను అర్థం చేసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు.' అని తెలిపింది.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)