Breaking News

తమిళ దర్శకులు ఎడ్యుకేటర్స్‌: మురుగదాస్‌

Published on Mon, 08/18/2025 - 07:02

తమిళ చిత్రాలు ఇప్పటివరకు రూ.1000 క్లబ్‌లోకి చేరలేదు. అయితే ఇతర భాషా చిత్రాలు రూ. 1000 కోట్ల క్లబ్‌ను దాటి చాలా కాలమే అయ్యింది. తాజాగా రజనీకాంత్‌ కథానాయకుడు నటించిన కూలీ చిత్రం ఆ రికార్డును బ్లాక్‌ చేస్తుందనే ప్రచారం విడుదలకు ముందు జరిగింది. అయితే ఆ చిత్రం కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుందనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమిళ చిత్రాలు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరకపోవడం గురించి సీనియర్‌ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ ఒక వివరణ ఇచ్చారు. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ఇటీవల వరుసగా అపజయాలను చవిచూస్తూ వచ్చారు.. 

కాగా తాజాగా ఈయన శివకార్తికేయన్‌ హీరోగా తెరకెక్కించిన చిత్రం మదరాసీ. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెపె్టంబర్‌ 5వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. విచిత్ర ప్రమోషన్‌ లో భాగంగా దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ఒక వ్యక్తి రోడ్‌లో వేగంగా వెళ్తున్నారంటే అది ఇంతకుముందే చేయబడిన బాట అని, అదే ప్రత్యేక బాటలో వెళ్లాలంటే అంత సులభం కాదన్నారు. తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడు శంకర్‌ ,మణిరత్నం వంటి వారు ప్రత్యేక బాటను వేస్తే అందులో ఎత్తు పల్లాలే ఎదురవుతాయన్నారు. 

ఇతర భాషా చిత్రాలు రూ.1000 కోట్ల పైగా వసూలు  చేస్తున్నాయని చెబుతున్నారని, ఇతర దర్శకులు ఎంటర్‌టైనింగ్‌  మాత్రమే చేస్తున్నారని, తమిళ దర్శకులు మాత్రం ఎడ్యుకేట్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనేది  తమిళ దర్శకులు ఎడ్యుకేషన్‌ చేస్తున్నారని అన్నారు. అందువల్లే ఇతర చిత్ర పరిశ్రమలకు, తమిళ చిత్ర పరిశ్రమకు చాలా వ్యత్యాసం ఉందని దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ పేర్కొన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)