Breaking News

రజనీకాంత్‌ వదిలేసుకున్న అపరిచితుడు.. ఫస్ట్‌ హీరోయిన్‌ సదా కాదు!

Published on Wed, 06/18/2025 - 16:24

దర్శకుడు శంకర్‌ ఇప్పుడంటే తడబడుతున్నాడు కానీ అద్భుతః అని చెప్పుకునే సినిమాలు గతంలో బోలెడు తీశాడు. రోబో, అపరిచితుడు, ఇండియన్‌, జీన్స్‌, శివాజీ.. ఇలా ఎన్నో కళాఖండాలు ఆయన సృష్టించినవే! వీటిలో అపరిచితుడు సినిమా వచ్చి జూన్‌ 17 నాటికి 20 ఏళ్లు పూర్తయింది. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యావత్‌ దేశాన్ని అల్లాడించేసింది. ఈ సినిమా గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

🎥 తమిళ అన్నియన్‌ తెలుగులో అపరిచితుడు (Aparichitudu Movie)గా రిలీజైంది. విక్రమ్‌, సదా జంటగా నటించారు. దాదాపు రూ.26.38 కోట్ల బడ్జెట్‌తో ఆస్కార్‌ రవిచంద్రన్‌ నిర్మించారు.

🎥 శంకర్‌ (Shankar Shanmugam) సినిమాలకు డైలాగ్స్‌, స్క్రీన్‌ప్లేలో స్టార్‌ రైటర్‌ సుజాత రంగరాజన్‌ భాగమే ఎక్కువగా ఉంటుంది. అపరిచితుడు కథ కూడా ఆయనే రాశారని ప్రచారం జరగ్గా.. అది తన కథే అని శంకర్‌ వెల్లడించాడు.

🎥 ఎక్కడైనా హీరో డబుల్‌ యాక్షన్‌, ట్రిపుల్‌ యాక్షన్‌ చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ఒకే మనిషి ముగ్గురి(రామానుజం, రెమో, అపరిచితుడు)లా కనిపిస్తాడు.

🎥 దక్షిణాదిన అన్ని భాషల్లో రిలీజైన (హిందీలోనూ డబ్‌ అయింది) ఈ మూవీ 37 సెంటర్స్‌లో వంద రోజులు ఆడింది.

🎥 అపరిచితుడు పబ్లిక్‌తో మాట్లాడే సీన్‌ను హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో తీశారు.

🎥 శంకర్‌ ఈ కథ మొదటగా రజనీకాంత్‌కు వినిపించాడు. ఆయన సారీ అనడంతో విక్రమ్‌ (Chiyaan Vikram.) దగ్గరకు వెళ్లినట్లు భోగట్టా!

🎥 విక్రమ్‌ భార్య శైలజ సైకాలజిస్ట్‌. దీంతో సినిమాలో హీరోకున్న పర్సనాలిటీ డిజార్డర్‌ గురించి భార్యను అడిగి ఆ మూడు పాత్రలకు తగ్గట్లుగా తనను తాను మల్చుకున్నాడు విక్రమ్‌.

🎥 హీరోయిన్‌గా కూడా జీన్స్‌ హీరోయిన్‌ ఐశ్వర్యరాయ్‌ను అనుకున్నారు. కానీ బాలీవుడ్‌లో బిజీ అవడంతో కుదర్లేదు. సిమ్రాన్‌ను అడగ్గా అప్పుడే పెళ్లి పిక్స్‌ అవడంతో తనూ చేజార్చుకుంది. చివరగా జయంతో పెద్ద హిట్‌ కొట్టిన సదాకు ఈ అవకాశం వరించింది.

🎥 ఏఆర్‌ రెహమాన్‌ లేకుండా సినిమా చేయని శంకర్‌.. ఈ చిత్రానికి రెహమాన్‌ శిష్యుడు హ్యారిస్‌ జైరాజ్‌ను తీసుకున్నాడు.

🎥 ఫ్రెంచ్‌ భాషలో రిలీజైన తొలి దక్షిణాది చిత్రంగా నిలిచింది.

🎥 ఫైట్‌ సన్నివేశం కోసం 120 కెమెరాలు ఉపయోగించిన తొలి భారతీయ చిత్రం.

🎥 అపరిచితుడు మే 17, 2024లో రీరిలీజ్‌ అయింది.

20 ఏళ్ల క్రితం లంచం, నిర్లక్ష్యం లేని సమాజాన్ని కోరుకున్న అపరిచితుడు కల ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది.

చదవండి: చై-శోభితను పట్టించుకోని మహేశ్‌? వీడియోతో ఆన్సర్‌ దొరికేసింది!

Videos

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)