Breaking News

రామ్ గోపాల్ వర్మ ఇంటికి ఏపీ పోలీసులు

Published on Mon, 11/25/2024 - 10:56

టాలీవుడ్  డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ నివాసానికి ప్రకాశం జిల్లా పోలీసులు చేరుకున్నారు. విచారణకు రావాలని హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి పోలీసులు వచ్చారు.  ఒంగోలు పోలీసు స్టేషన్‌కు విచారణ నిమిత్తం సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే, వర్మ ఒంగోలుకు రావడం లేదని తెలియడంతో పోలీసులే ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసుల విచారణకు సహకరించకుంటే  వర్మను అరెస్ట్‌ చేసి ఒంగోలు తీసుకొచ్చే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం.

ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో వర్మపై కేసు నమోదైన విషయం తెలిసిందే. 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చంద్రబాబు, నారా లోకేశ్ తదితరులపై కించపరిచేలా సోషల్ మీడియాలో ఆయన పోస్టులు పెట్టారని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేయడంతో ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నవంబర్‌ 19న పోలీసుల విచారణలో వర్మ పాల్గొనాల్సి ఉండగా.. ఆ సమయంలో తనకు సినిమా షూటింగ్స్‌ ఉండటం వల్ల హాజరు కాలేదు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

ఈ క్రమంలో పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. వాటికి కూడా వర్మ సమాధానం ఇచ్చారు. డిజిటల్ విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇదే విషయాన్ని వాట్సాప్‌ ద్వారా డీఎస్పీకి సమాచారం అందించామని ఆయన పేర్కొన్నారు. అయినా సరే పోలీసులు వర్మ ఇంటికి రావడంలో కుట్ర కోణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వర్మ  ముందస్తు బెయిల్, క్వాష్  పిటిషన్‌లపై హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

విచారణ పేరుతో తనను అరెస్టు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని  రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు. ఈమేరకు తనకు ముందస్తు బెయిల్‌ కావాలని పిటిషన్‌ వేశారు.  రాజకీయ దురుద్దేశంతోనే తనపైన కేసు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను ఎవరి పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదని.. అలాగే వర్గాల మధ్య శతృత్వం సృష్టించేలా పోస్టులు చేయలేదని పిటిషన్‌లో ప్రస్తావించారు. 

రాంగోపాల్ వర్మ ఇంటికి ప్రకాశం జిల్లా పోలీసులు

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)