Breaking News

'ఎన్టీఆర్‌' ఫ్యాన్స్‌ అరెస్ట్‌.. పోలీస్‌ స్టేషన్‌కు ముజీబ్

Published on Mon, 08/18/2025 - 13:31

అనంతపురం అర్బన్‌ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు భగ్గుమంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. నందమూరి వారసుడిపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోఘ ఆ పార్టీపై కూడా తారక్‌ అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. తమ అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టడాన్ని వారు జీర్ణించుకోలేక పోయారు. దీంతో ఇప్పటికే అనంతపురం శ్రీనగర్‌ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైకి దాడికి దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే భారీ ఫ్లెక్సీలను చింపేసి నిరసన తెలిపారు. 

అయితే, నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్‌ అభిమానులను పలుచోట్ల పోలీసులు అరెస్ట్‌ చేశారు. రోడ్లపైకి వచ్చి ఎలాంటి విధ్వంసం చేయరాదని హెచ్చరించారు. దీనిని ఫ్యాన్స్‌ తీవ్రంగా తప్పుబడుతున్నారు. మా అభిమాన హీరోను నోటికొచ్చినట్లు తిట్టి మా మీదే కేసులు పెడుతారా..? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే మదనపల్లిలోని ఎన్టీఆర్ అభిమానులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అభిమానులు రాష్ట్రం మొత్తం ఎక్కడ ధర్నాలు, ర్యాలీలు ప్రెస్‌మీట్‌లు పెట్టకూడదని వారు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్‌లను పోలీస్‌స్టేషన్‌ వద్దకు పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదోనిలోని పోలీస్‌స్టేషన్‌కు జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏపీ కన్వీనర్‌ ముజీబ్ అహ్మద్ కూడా వెళ్లారు. కుప్పంలో కూడా పోలీసుల ఒత్తిడి వల్ల ధర్నాలు, ర్యాలీలను ఎన్టీఆర్ అభిమానులు క్యాన్సిల్‌ చేసుకున్నారు. తప్పు చేసిన వాళ్లను వదిలేసి కేవలం ఎన్టీఆర్‌ అభిమానులను మాత్రమే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. ఒక తల్లి గురించి  నోటికొచ్చిన మాటలు మాట్లాడిన వారి మీద కేసులు పెట్టరా..? అంటూ ఫైర్‌ అవుతున్నారు.

తారక్‌ గురించి నీచంగా మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే
ఒక ఫోన్‌ కాల్‌లో ఎన్టీఆర్‌ గురించి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ ఇలా మాట్లాడారు.  ‘జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒక బుడ్డా ఫకీర్‌.. వాడి సినిమాలు ఇక్కడ ఎలా ఆడనిస్తానని అనుకున్నారు.. లోకేశ్‌ను తిట్టిన వాడి సినిమాలు ఎలా ఆడనిస్తాను.. వానెమ్మ.. లం.. కొడుకు.. వాని సినిమాలు ఆడనిస్తానా.. మీరెలా ఆడనిస్తార్రా గాడిదల్లారా.. నా పర్మిషన్‌ లేకుండా వేయిస్తారా.. ఈ సినిమా ఆడదు..’ అంటూ అనంతపురం అర్బన్‌ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ నోరు పారేసుకున్నారు.  జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘వార్‌–2’ సినిమా విడుదల నేపథ్యంలో ఎమ్మెల్యే ఇటీవల ఎన్టీఆర్‌ అభిమాన సంఘం నేత ధనుంజయనాయుడుతో మాట్లాడిన ఫోన్‌ కాల్‌ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)