Breaking News

అనుష్కపై ఆగని ట్రోలింగ్స్‌

Published on Sat, 03/28/2026 - 07:03

సెలబ్రిటీలకు రాజభోగం ఆరు, వదంతుల తలనొప్పి 12 అన్నంతగా పరిస్థితులు మారుతున్నాయని చెప్పవచ్చు. మొదట్లో ఎన్నో అవమానాలు, అవరోధాలను ఎదుర్కొని, ఎంతో శ్రమించి ఉన్నత స్థాయికి చేరుకున్న వారికి వివిధ రూపాల్లో వచ్చే వదంతులు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయా అంటే కచ్చితంగా అవుననే బదులే వస్తోంది. ముఖ్యంగా సినీ నటీమణులను ఇలాంటి వదంతులు చుట్టుముట్టి అశాంతికి గురిచేస్తున్నాయని చెప్పవచ్చు. వాస్తవానికి వదంతులను చాలా మంది ఎంజాయ్‌ చేస్తారు. అయితే ఒక్కోసారి వ్యక్తి గత విషయాలపై అవాస్తవాలు ప్రచారం అయినప్పుడు అలాంటి వాటిని ఖండించాల్సి వస్తుంది. అనుష్క పరిస్థితి ఇలాంటిదే. 

ఈ బెంగళూరు భామ నటనలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారనే చెప్పాలి. మొదట్లో అందాలారబోతతో యువతను అలరించినా, సరైన పాత్ర వేస్తే తన తడాఖా చూపిస్తానని అరుంధతి చిత్రంతో నిరూపించుకున్నారు. ఆ మధ్య సైజ్‌ జీరో అనే చిత్రంలోని పాత్ర కోసం బరువు భారీగా పెరిగిన అనుష్క ఆ తరువాత బరువు తగ్గడానికి చేసిన ఏ ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. దీంతో అవకాశాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇదిలా ఉంటే ఈమె వ్యక్తి గత జీవితంపై ట్రోలింగ్స్‌ వైరల్‌ అవడం, ముఖ్యంగా అనుష్క పెళ్లి వదంతులు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. తన పెళ్లి గురించి జరుగుతున్న ప్రచారాన్ని ఈమె చాలా సార్లు ఖండించారు. వయసును  ప్రస్తావించడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అయినప్పటికీ అనుష్క గురించి ఏదో ఒక ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూనే ఉంది. తాజాగా అనుష్కకు పెళ్లి నిశ్చితార్థం జరిగిందని, ఆమె ఒక వ్యక్తి చెయ్యి పట్టుకుని నడుస్తున్న ఫొటోను పోస్ట్‌ చేసి ట్రోలింగ్‌ చేస్తున్నారన్నారు. వాస్తవానికి ఆ ఫొటో 2016లో జరిగిన ఒక ఫ్యాషన్‌ కార్యక్రమానికి చెందింది. ఇలా వాస్తవాలను తెలుసుకోకుండా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఏది నిజమో ? ఏది అవాస్తవమో తెలియని పరిస్థితి నెలకొంటోంది.   

Videos

అమరావతి పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నావ్ .. KK రాజు సంచలన రియాక్షన్

మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు

రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో రగడ..CI బాజీలాల్ పై మార్గాని భరత్ ఫైర్

గ్యాస్ కోసం ఆటోవాలాల కష్టాలు కిలోమీటర్ల మేర వాహనాలు

2029లో జగన్ వస్తాడనే భయంతోనే అమరావతిపై చట్టబద్ధత బిల్లు..

తెలంగాణలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు

తృణమూల్ కాంగ్రెస్ పాలనపై పుస్తకాన్ని విడుదల చేసిన అమిత్ షా

రూపం మార్చుకొని మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్..

అమెరికా సంచలన ప్రకటన ఇరాన్ పని ఖతం!

అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు

Photos

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)