అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్

Published on Tue, 03/31/2026 - 14:37

బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న అనుష్క శెట్టి.. బరువు సమస్యల కారణంగా తర్వాత మూవీస్ చేయడం చాలా తగ్గించేసింది. అప్పుడో ఇప్పుడో అన్నట్లు చేస్తూ వస్తోంది. 2023లో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో హిట్ అందుకున్న ఈ హీరోయిన్.. గతేడాది 'ఘాటీ'తో ఘోరమైన డిజాస్టర్ చవిచూసింది. ఇప్పుడు 'కథనార్' అనే మలయాళ చిత్రంతో వచ్చేందుకు సిద్ధమైంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

ఫాంటసీ థ్రిల్లర్ స్టోరీతో తీసిన ఈ సినిమాని తెలుగు, తమిళంలోనూ రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో అనుష్కకి రెండు మూడు షాట్స్‌కి మాత్రమే పరిమితం చేశారు. విజువల్స్ బాగున్నాయి గానీ కాన్సెప్ట్ అర్థమై అర్థం కానట్లు అనిపించింది. డబ్బింగ్‌లో ఉపయోగించిన తెలుగు పదాలు కూడా సగటు ప్రేక్షకుడికి అర్థం కాని విధంగా ఉన్నాయి.

జయసూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి హీరోయిన్. ప్రభుదేవా, శాండీ మాస్టర్, వినీత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాది జూలై ఆగస్టులో థియేటర్లలోకి మూవీ రానుందని తెలుస్తోంది. రోజిన్ థామస్ దర్శకుడు. అనుష్కకి ఇది 50వ మూవీ కావడం విశేషం.

(ఇదీ చదవండి: పెద్ది రిలీజ్‌ డేట్.. నన్ను క్షమించండి: నిర్మాత ఎస్‌కేఎన్)

Videos

కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం

పశ్చిమాసియాలో హైఅలర్ట్.. కువైట్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ను పేల్చేసిన ఇరాన్

వైఎస్ జగన్‌ను కలిసిన గురజాల నియోజకవర్గ స్థానిక నేతలు

బీజేపీలో చేరిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్

అమెరికాపై యుద్ధం ఎఫెక్ట్ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

అమరావతి చట్టబద్దత పేరుతో బాబు డైవర్షన్ పాలిటిక్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై, YSRCP రౌండ్ టేబుల్ సమావేశం

సినీ ఇండస్ట్రీ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈవారం ఇన్వెస్టర్లకు పండగే.. బోనస్, స్టాక్ స్ప్రిట్, డివిడెండ్లు కుమ్మరించనున్న స్టాక్స్ ఇవే..!

అంబులెన్సును తోస్తున్న పోలీసులు

Photos

+5

ఘనంగా భగవాన్‌ మహావీర్‌ జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

పైలట్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ జనని (ఫొటోలు)

+5

భార్యతో కలిసి హీరో నితిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మార్చి నెల జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ (ఫొటోలు)

+5

రాకాస ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెరిసిన నీహారిక.. (ఫొటోలు)

+5

బెంగళూరు : కనువిందుగా హారతి దీపాల వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్: మధ్యాహ్నం భానుడి భగభగలు.. సాయంత్రం వరుణుడి పలకరింపు (ఫొటోలు)

+5

‘రాకాస’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్‌ అబ్బవరం ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)