Breaking News

రెండుసార్లు గుండెపోటు, వీల్‌చైర్‌కే పరిమితం: దర్శకుడు

Published on Wed, 02/18/2026 - 16:57

బాలీవుడ్‌ దర్శకుడు, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ 2023లోనే రాసుకున్న కథ "కెనడీ". షూటింగ్‌ పూర్తయి చాలాకాలం అయిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో ఈ శుక్రవారం (ఫిబ్రవరి 20) విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో అనురాగ్‌ కశ్యప్‌ తను కెరీర్‌లో ఎదుర్కొన్న ఇబ్బందులను పేర్కొన్నాడు.

2009 నుంచి..
అతడు మాట్లాడుతూ.. మాగ్జిమమ్‌ సిటీ ప్రాజెక్ట్‌ విషయంలో నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్‌ కోసం చాలా ఖర్చుపెట్టాం. 2009 నుంచి నా ధ్యాసంతా ఆ సినిమాపైనే! ఈ కథను నెట్‌ఫ్లిక్స్‌ చదవకుండానే ఓకే చెప్పేసింది. మీరు దేనికి ఓకే చెప్పారో ఒకసారి చూసుకోండి అంటే ఒక్కరు తప్ప ఎవరూ స్క్రిప్ట్‌ చదవలేదు.

పక్కన పడేసిన నెట్‌ఫ్లిక్స్‌
ఏడాదిన్నర కాలంలో నేను 900 పేజీలు రాశాను. నా స్క్రిప్ట్‌ నచ్చకపోయుంటే నెట్‌ఫ్లిక్స్‌ ముందే చెప్పొచ్చుగా! సైలెంట్‌గా ఉండిపోయింది. తర్వాత సడన్‌గా తమ పాలసీలో కొన్ని మార్పులు చేస్తున్నామంటూ పలు వెబ్‌ సిరీస్‌, సినిమాలను రద్దు చేసింది. అందులో నా ప్రాజెక్ట్‌ ఒకటి. అయితే దానికి పరిహారంగా వేరే స్క్రిప్ట్‌ పంపించి వాటిని డైరెక్ట్‌ చేయమని అడిగింది. అవి యావరేజ్‌గా ఉన్నాయని, నాకు కొంచెం సమయం ఇవ్వండని అడిగాను. 

రెండుసార్లు గుండెపోటు
వాళ్లు మాత్రం మా దగ్గర 4 నెలలపాటు యాక్టర్స్‌ డేట్స్‌ ఖాళీగా ఉన్నాయని ఒత్తిడి చేశారు. నాకు కొంచెం సమయం ఇస్తే తప్ప వాటిని చేయలేనని చెప్పాను. నేను రాసిన ఒక షో వారికి బాగా నచ్చింది. కానీ దాన్ని మనీ హీస్ట్‌ ఇండియన్‌ వర్షన్‌గా మార్చి రాయమన్నారు. వాళ్ల పద్ధతి నాకసలు నచ్చలేదు. చాలా బాధపడ్డాను. ఎక్కువ ఒత్తిడి, బాధ వల్ల రెండుసార్లు గుండెపోటు వచ్చింది. 

ఆస్తమా
దాంతో రక్తం పలుచబడేందుకు మందులు వాడాను, కరోనా వ్యాక్సిన్‌ కూడా అప్పుడే తీసుకున్నాను. ఇవి నా శరీరంలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ చూపించాయి. ఆస్తమా వచ్చింది. దానికోసం స్టెరాయిడ్స్‌ వాడాను. ఎక్కువ డోసు మందులు వాడేసరికి నాకు డ్రగ్స్‌ వాడినట్లే అనిపించింది. తాగడం మొదలుపెట్టాను. జంక్‌ఫుడ్‌ ఆర్డర్‌ పెడుతూ నచ్చినట్లు తిన్నాను. ఎనిమిది నెలల్లోనే 35 కిలోలు పెరిగాను. 

వీల్‌చైర్‌కే పరిమితం
నన్ను చూసి నా కూతురు భయపడిపోయింది. రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు పంపింది. అలా మూడుసార్లు రిహాబిలిటేషన్‌కు వెళ్లాను. ఒకసారి అక్కడ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు నా కుడి కాలుకి దెబ్బ తగిలింది. రక్తం పలుచబడే మందులు వాడుతున్నందున సర్జరీ చేయడం కుదరదన్నారు. కొన్ని నెలలపాటు వీల్‌చైర్‌లో ఉన్నాను. నెమ్మదిగా కోలుకుని ఇప్పుడిలా ఉన్నాను అని అనురాగ్‌ కశ్యప్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: మగవాళ్ల మందు పార్టీకి ఒంటరిగా రమ్మని పిలుపు: నటి

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)