Breaking News

కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్న దర్శకుడు!

Published on Sun, 12/10/2023 - 09:53

ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్‌ కశ్యప్‌.. గ్యాంగ్‌ ఆఫ్‌ వసీపూర్‌ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన పలు హిట్‌ చిత్రాలను తెరకెక్కించాడు. నటుడిగానూ, పలు చిత్రాలలో యాక్ట్‌ చేసిన అనురాగ్‌ కశ్యప్‌ కోలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితుడే. నయనతార, విజయ్‌ సేతుపతి జంటగా నటించిన ఇమైకా నొడిగల్‌ చిత్రంలో విలన్‌గా నటించి తన విలక్షణ నటనను ప్రదర్శించాడు.

ఇటీవల విజయ్‌ కథానాయకుడిగా నటించిన లియో చిత్రంలోనూ చిన్న పాత్రలో మెరిశాడు. ఈయన దర్శకత్వం వహించిన కెన్నడీ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే దర్శకుడిగా ఈయన కోలీవుడ్‌ ఎంట్రీ షురూ అయినట్లు సమాచారం. ఈయన దర్శకత్వంలో జీవీ ప్రకాష్‌కుమార్‌ హీరోగా పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కనుంది. దీని గురించి జీవీ ప్రకాష్‌ కుమార్‌ ఇటీవల ఒక భేటీలో మాట్లాడుతూ బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌కశ్యప్‌ తనను హీరోగా నటించమని అడిగారన్నాడు.

ఇది పాన్‌ ఇండియా చిత్రంగా ఉంటుందన్నాడు. కాగా జీవీ ప్రకాష్‌కుమార్‌ ప్రస్తుతం నటుడిగా, సంగీత దర్శకుడిగా చాలా బిజీగా ఉన్నాడు. ఈయన నటించిన రెబల్‌ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దీనితో పాటు 13, ఇడి ముళక్కమ్‌, కల్వన్‌ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. అదేవిధంగా సైరన్‌, సియాన్‌ విక్రమ్‌ 62వ చిత్రం, శివకార్తికేయన్‌ 21వ చిత్రం , సూర్య 43వ చిత్రం అంటూ సంగీత దర్శకుడిగానూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలను పూర్తి చేసిన తరువాత ఈయన అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది.

చదవండి: 10 మంది పొగిడితే, 50 మంది తిట్టారు: నయనతార

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)