Breaking News

ప్రియుడితో ప్రముఖ బుల్లితెర నటి ఎంగేజ్‌మెంట్‌..!

Published on Fri, 01/23/2026 - 15:37

ప్రముఖ బుల్లితెర నటి అద్రిజా రాయ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. అనుపమ సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనుంది. తాజాగా తన ప్రియుడు విఘ్నేష్ అయ్యర్‌తో నిశ్చితార్థం చేసుకోనుంది. ఈనెల 25న వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ వేడుక జరగనుంది.

కాగా.. 'అనుపమ' సీరియల్‌లో రాహి పాత్రతో నటి అద్రిజా రాయ్ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఇమ్లీ, కుండలి భాగ్య, దుర్గ ఔర్ చారు లాంటి సీరియల్స్‌లో నటించింది. అంతేకాకుండా బాయ్‌ ఫ్రెండ్స్ అండ్ గర్ల్‌ఫ్రెండ్స్ అనే మూవీలోనూ కనిపించింది. తాజాగా తన ప్రియుడు విఘ్నేష్ అయ్యర్‌తో జనవరి 25న ఫామ్‌హౌస్‌లో నిశ్చితార్థానికి రెడీ అయిపోయింది. ఈ నిశ్చితార్థం వేడుకకు కేవలం సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరు కానున్నారు.

అయితే తాము పెళ్లి విషయంలో తొందరపడటం లేదని ఆద్రిజా రాయ్ వెల్లడించింది. మేము ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేయడం లేదని చెప్పింది. వచ్చే రెండేళ్లలో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఆమె పేర్కొంది. పెళ్లి ఎప్పుడు జరిగినా బెంగాలీ, దక్షిణ భారత (తమిళ) సంప్రదాయాల ప్రకారమే పెళ్లి చేసుకోవడం నా కల అని వెల్లడించింది.  ఇటీవల తన నిశ్చితార్థానికి ముందు ఆద్రిజా తన కాబోయే భర్తతో కలిసి బృందావనంలోని బాంకే బిహారీ ఆలయాన్ని సందర్శించి ఆశీస్సులు తీసుకుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)