Breaking News

'అలా అడిగితే యాటిట్యూడ్ ఎక్కువంటారు': అనుపమ పరమేశ్వరన్

Published on Tue, 08/12/2025 - 19:05

అనుపమ పరమేశ్వరన్ చాలా రోజుల తర్వాత తెలుగులో చేసిన తాజా చిత్రం 'పరదా'. లేడీ ఓరియంటెడ్ చిత్రానికి సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటికే పరదా ట్రైలర్రిలీజ్ చేయగా.. మూవీపై అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచేసింది. డైరెక్టర్ ప్రవీణ్ సైతం రివ్యూలు బాగుంటేనే పరదా చూడాలని ఆడియన్స్కు సవాల్ విసిరారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న అనుపమ తాజాగా ఇంటర్వ్యూకు హాజరైంది. సందర్భంగా మూవీ సెట్లో షాట్ఆలస్యం కావడంపై స్పందించింది.

అనుమప మాట్లాడుతూ..' ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిలు నోరు విప్పడానికి భయపడతారు. ఏదైనా అడిగితే ఈమెకు ఆటిట్యూడ్ ఎక్కువ అంటారు. ఉదయం 7 గంటలకు షూట్కు వెళ్తే.. 9:30 వరకు వెయిట్ చేయాలి. ఎందుకు ఆలస్యమైందని అడిగితే మీకు యాటిట్యూడ్ ఎక్కువ అని ముద్ర వేస్తారు. కో యాక్టర్ ఆలస్యంగా వచ్చినప్పుడు మమ్మల్ని ముందు ఎందుకు పిలవాలి. ముందుగానే సెట్కు పిలిచి రెండున్నర గంటల పాటు ఎందుకు వెయిట్ చేయించాలి. గ్యాప్లో చాలా షాట్స్ తీయొచ్చు కదా అని అడిగితే.. నా డబ్బులు కదా మీకేంటి ఇబ్బంది అని అంటారు. అమ్మాయిలు ఏదైనా డైెరెక్ట్‌గా అడిగేస్తారు. అబ్బాయిలను మరో విధంగా ట్రీట్ చేస్తారు. అందరూ ఇలానే చేస్తారని నేను చెప్పట్లేదు' అని అన్నారు.

కాగా.. అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా ఆగస్టు 22న థియేటర్లలోకి మూవీ రానుంది. ఇందులో అనుపమతో పాటు మలయాళ నటి దర్శన్, సంగీత కూడా కీలక పాత్రల్లో నటించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)