Breaking News

ఆ సినిమా చేస్తున్నప్పుడు కంఫర్ట్‌గా అనిపించలేదు: అనుపమ

Published on Tue, 08/12/2025 - 10:19

అనుపమ పరమేశ్వరన్ పేరు చెప్పగానే హోమ్లీ హీరోయిన్ అనే తరహా పాత్రలే గుర్తొస్తాయి. దాదాపు అలాంటి రోల్స్ చేస్తూ వచ్చింది. కానీ గతేడాది రిలీజైన 'టిల్లు స్క్వేర్' మాత్రం అనుపమలో కొత్త యాంగిల్‌ని అందరికీ పరిచయం చేసింది. ఎందుకంటే ఆ సినిమా స్కర్ట్స్ వేసుకుని, లిప్ కిస్ సన్నివేశాల్లో కనిపించేసరికి అభిమానులు షాకయ్యారు. అనుపమ ఇలాంటి పాత్ర చేయడం ఏంటని కూడా అనుకున్నారు. ఇప్పుడు వాటన్నింటికీ స్వయంగా ఆమె సమాధానమిచ్చింది.

అనుపమ నటించిన లేటెస్ట్ మూవీ 'పరదా'. ఈ నెల 22న థియేటర్లలోకి రానుంది. మొన్ననే ట్రైలర్ లాంచ్ చేయగా.. మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంది. అలా ఒకదానిలో మాట్లాడుతూ.. 'టిల్లు స్క్వేర్' చేస్తున్న సమయంలో తాను కంఫర్ట్‌గా లేననే విషయాన్ని బయటపెట్టింది. చాన్నాళ్ల పాటు ఆలోచించిన తర్వాతే సినిమా చేసిన సంగతి కూడా చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ఇదెక్కడి విడ్డూరం.. 'కూలీ, 'వార్ 2'తో తెలుగు ప్రేక్షకులపై ఎందుకీ భారం?)

'నా అభిమానులకు ఆ పాత్ర నచ్చలేదని కాదు నేను అలాంటి రోల్ చేయడం నచ్చలేదు. దానికి తప్పు అని చెప్పలేను. ఆ సినిమాలో చేసిన క్యారెక్టర్.. నేను ఒప్పుకోవడానికి కూడా చాలా టైమ్ పట్టింది. చెయ్యాలా వద్దా అని చాలా సమయం తీసుకుని.. ఓ రకంగా చెప్పాలంటే నిర్ణయం తీసుకోవడం నాకు చాలా కష్టమైంది. సెట్‌కి వెళ్లి  100 శాతం కాన్ఫిడెంట్‌గా చేసిన సినిమా కూడా కాదు అది. సినిమాలో గానీ ప్రమోషన్లలో గానీ ఆ డ్రస్సులు వేసుకోవడం నాకు కంఫర్ట్‌గా అనిపించలేదు. వేర్వేరు మూవీస్‌లో చేసినట్లే ఇది ఓ ఛాలెంజ్‌లా అనిపించింది'

'ఈ క్యారెక్టర్ చేస్తే ఏమనుకుంటారోనని చాలా సందేహాలు ఉండేవి. కాకపోతే ఆ పాత్ర చాలా బలమైనది అని భావించాను. సినిమా రిలీజయ్యాక కూడా హీరోకి సమానంగా ఉందని అంతా అన్నారు. అందుకే నేను ఆ పాత్ర వదలుకోదల్చుకోలేదు. అలాంటి పాత్ర చేద్దామని ఫిక్స్ అయితే విమర్శల్ని కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. నేను ఇలాంటి విమర్శలు వస్తాయని ముందే ఊహించాను అదే జరిగింది కూడా' అని అనుపమ చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: ప్రభాస్ పెళ్లి కోసం పెద్దమ్మ పూజలు!)

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)