Breaking News

ఆయన గట్టి గట్టిగా అరిచాడు.. నేనైతే ఏడ్చేదాన్ని: అను ఇమ్మాన్యుయేల్‌

Published on Tue, 11/11/2025 - 16:59

తమిళ సినిమా 'అదర్స్' ప్రమోషన్లలో నటి గౌరీ కిషన్‌కి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో 'మీ బరువెంత?' అని ఓ జర్నలిస్ట్‌ ప్రశ్నించడం వివాదస్పదమైంది. సినిమా గురించి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నా పర్సనల్‌ విషయాల గురించి ఎందుకు అడిగారని సదరు జర్నలిస్ట్‌పై గౌరీ  ఫైర్‌ అయ్యారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్స్‌  గౌరికి మద్దతు తెలుపుతూ.. జర్నలిస్ట్‌ని ట్రోల్‌ చేశారు. చివరకు సదరు జర్నలిస్ట్‌ క్షమాపణలు చెప్పినా కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. జర్నలిస్ట్‌ సారీని గౌరీ అంగీకరించలేదు. 

'జవాబుదారీతనం లేని క్షమాపణ అసలు క్షమాపణే కాదు. ఆయన ప్రశ్నని నేను తప్పుగా అర్థం చేసుకున్నానని.. ఆయన  బాడీ షేమింగ్ చేయలేదనడం కరెక్ట్‌ కాదు’ అంటూ ఆయన క్షమాపణలను తోసిపుచ్చింది. ఈ వివాదం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు చిత్రపరిశ్రమం మొత్తం హాట్‌ టాపిక్‌గా మారింది. 

తాజాగా దీనిపై హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్‌(Anu Emmanuel ) స్పందించింది. జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్న చాలా తప్పని అను చెప్పింది. ఒకరి బాడీపై కామెంట్స్‌ చేసే అధికారం ఎవరికీ లేదని అను పేర్కొంది.

గర్ల్‌ఫ్రెండ్‌ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా గౌరి కిషన్‌ ఇష్యూ గురించి ప్రశ్నించగా.. పై విధంగా సమాధానం చెప్పారు. ‘నేను ఆ ప్లేస్‌లో ఉంటే ఏడ్చేదాన్నేమో. ఆ జర్నలిస్ట్‌ గౌరీపై గట్టి గట్టిగా అరిచాడు. కానీ ఆమె ధైర్యంగా ఎదురించింది. హీరోని సినిమా విషయాల గురించి చక్కగా అడిగిన ఆ జర్నలిస్ట్‌.. హీరోయిన్‌ దగ్గరకు వచ్చేసరికి ‘బరువెంత?’అని అడిగాడు. సినిమాకు ఆమె బరువుకు ఏం సంబంధం? హీరోయిన్‌ అంటే లిప్‌స్టిప్‌ పెట్టుకొని మంచిగా రెడీ అయి ఉండడమేనా? అంతకు మించి కూడా మాలో వేరే టాలెంట్‌ ఉంటుంది. అది గుర్తించండి’ అని అను ఇమ్మాన్యుయేల్‌ పేర్కొంది. 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)