Breaking News

సంక్రాంతి బరిలో మరో టాలీవుడ్ సినిమా!

Published on Mon, 10/14/2024 - 21:46

సుమంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం మహేంద్రగిరి వారాహి. రాజశ్యామల బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర గ్లింప్స్‌ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. గ్లింప్స్ ఆసక్తికరంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు.  ఈ మూవీ గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది.

కాగా.. మహేంద్రగిరి వారాహి సినిమాలో కమెడియన్ బ్రహ్మానందం నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నిర్మాత కాలిపు మధు ఇటీవల వెల్లడించారు. ఈ మూవీ స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని బ్రహ్మానందం చేయబోతున్నారని దర్శకుడు సంతోష్ తెలిపారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

కాగా.. వచ్చే ఏడాది-2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కాగా..  వచ్చే సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది.

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)