Breaking News

అల్లు అర్జున్ రాకా.. మరో భామ రాక..!

Published on Mon, 08/24/2026 - 22:14

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా వస్తోన్న మూవీ రాకా. ఈ మూవీకి  అట్లీ దర్శకత్వంలో వహిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె మెయిన్‌ లీడ్‌ రోల్లో‌ నటిస్తున్నారు. అంతేకాకుండా మృణాల్‌ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మికా మందన్నా నటిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ట్రిపుల్‌ రోల్‌ చేస్తున్నారని సమాచారం. వీటిలో ఓ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. ఇటీవలే మంచు లక్ష్మీ సైతం రాకా షూటింగ్ సెట్‌ అద్భుతంగా ఉందంటూ కొనియాడింది.

ఈ నేపథ్యంలో రాకాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ మూవీలో నలుగురు భామలు కనిపించనున్నారు. తాజాగా మరో ముద్దుగుమ్మ ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కానుందని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ ఐశ్వర్య లక్ష్మీ సైతం నటించనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం. లేడీ విలన్‌ పాత్ర పోషించనుందని లేటేస్ట్ టాక్. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. దీనిపై రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.

a

ప్రస్తుతం ముంబయిలో వేసిన ఓ భారీ సెట్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌ శివార్లలోని ఓ స్టూడియోలో సెట్‌ను రెడీ చేయిస్తున్నారని సమాచారం. ఈ సెట్‌ వర్క్‌ పూర్తయ్యాక అక్కడ చిత్రీకరణ ఆరంభిస్తారని సమాచారం. కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు, జిమ్‌ సర్భ్, ఫెమినా జార్జ్, నైలా గ్రేవాల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సాయి అభ్యంకర్‌ సంగీతమందిస్తున్నారు.  

 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)