Breaking News

ఆ నమ్మకంతోనే కోలీవుడ్‌ వెళ్లాను: సందీప్‌ కిషన్‌

Published on Wed, 12/10/2025 - 00:03

‘‘యంగ్‌ హీరోలు ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు చేయాలని కోరుకునే మూడు సినిమాల్లో తప్పకుండా ఒకటి కార్తీ అన్నది ఉంటుంది. ఆయన్ను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నప్పుడు.. నన్ను తమిళ ప్రేక్షకులు ఇష్టపడరా? అనే నమ్మకంతోనే కోలీవుడ్‌ వెళ్లాను. అక్కడ నాకు ప్రతిసారీ తన సపోర్ట్‌ అందిస్తుంటారు కార్తీ అన్న. ఆయన చేసిన ‘అన్నగారు వస్తారు’ సినిమా విజయం సాధించాలి’’ అని హీరో సందీప్‌ కిషన్‌ తెలిపారు. కార్తీ హీరోగా, కృతీశెట్టి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘అన్నగారు వస్తారు’. నలన్‌ కుమారస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ సినిమా మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ ద్వారా ఈ నెల 12న తెలుగులో విడుదలవుతోంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ‘అన్నగారు వస్తారు’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి డైరెక్టర్స్‌ బాబీ(కేఎస్‌ రవీంద్ర), వెంకీ కుడుముల, శివ నిర్వాణ, దేవ కట్టా, వివేక్‌ ఆత్రేయ, రాహుల్‌ రవీంద్రన్, శైలేష్‌ కొలను, దర్శక–నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి అతిథులుగా హాజరై, ‘అన్నగారు వస్తారు’ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. నిర్మాత ‘బన్నీ’ వాస్‌ మాట్లాడుతూ–‘‘సూర్య, జ్ఞానవేల్‌ రాజాగార్లతో మాకు మంచి అనుబంధం ఉంది. కార్తీగారి మీద  ఉన్న అభిమానం వల్లే ఈ వేడుకకి ఇంతమంది యంగ్‌ డైరెక్టర్స్‌ వచ్చారు. ‘అన్నగారు వస్తారు’ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని చెప్పారు.

‘‘ఈ సినిమాను మా సంస్థ ద్వారా రిలీజ్‌ చేస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు మైత్రీ డిస్ట్రిబ్యూషన్‌ శశిధర్‌. ‘‘తమిళంలో నా తొలి చిత్రంతోనే కార్తీగారితో కలిసి నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది’’ అని కృతీశెట్టి పేర్కొన్నారు. కార్తీ మాట్లాడుతూ–‘‘ఎన్టీఆర్, ఎంజీఆర్‌గార్లు సినిమాను, రాజకీయాలను, ప్రజా జీవితాలను మార్చేశారు. వారు మనకు సూపర్‌ హీరోస్‌. అలాంటి వాళ్లు మళ్లీ ఇప్పుడు తిరిగొస్తే ఎలా ఉంటుంది? అనేది ‘అన్నగారు వస్తారు’ సినిమా కథ’’ అన్నారు. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)