పదేళ్ల తర్వాత ధనుష్‌తో పనిచేయనున్న స్టార్‌ సంగీత దర్శకుడు

Published on Tue, 10/14/2025 - 07:00

సౌత్‌ ఇండియాలో  ప్రస్తుతం క్రేజీ సంగీత దర్శకుడిగా వెలుగొందుతున్న అనిరుధ్‌ తన సంగీత పయనాన్ని ప్రారంభించింది నటుడు ధనుష్‌ కథానాయకుడిగా నటించిన 3 చిత్రంతోననే విషయం తెలిసిందే. ఈ చిత్రం పెద్దగా సక్సెస్‌ కాకపోయినా, అందులోని వై దిస్‌ కొలవెరి  పాట ప్రపంచ వ్యాప్తంగా మార్మోగింది. తరువాత 'రఘువరన్ బి.టెక్ , మారి, నవమన్మధుడు' చిత్రాల వరకూ ధనుష్‌ కోసం అనిరుధ్‌ సంగీతాన్ని అందించారు. వీరిద్దరి మధ్య బంధుత్వం కూడా ఉండటంతో అలా వారి జర్నీ కొనసాగింది. కానీ,  వీరిద్దరి మధ్య బేధాబిప్రాయాలు వచ్చాయనే ప్రచారం కోలీవుడ్‌లో జరిగింది. కుటుంబ విషయంలో ఇద్దరి మధ్య కాస్త గ్యాప్‌ వచ్చిందని కొందరు చెబితే... ఐశ్వర్యతో ధనుష్‌ విడాకులు తీసుకోవడం వల్ల అనిరుధ్‌ కాస్త దూరం జరిగాడని అంటారు. 

అయితే ఇందులో నిజం ఎంత అన్నది పక్కన పెడితే.. సుమారు పదేళ్లుగా వీరిద్దరి కాంబోలో ఒక్క సినిమా కూడా రాలేదు. దీంతో  ఈ హిట్‌ కాంబినేషన్‌లో చిత్రం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అలాంటి సందర్భం ఇప్పుడు వస్తోందన్నది తాజా సమాచారం.  ధనుష్‌ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదే విధంగా అనిరుధ్‌ నటుడు రజనీకాంత్‌ చిత్రాలకు వరుసగా పని చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా  ధనుష్‌ హీరోగా లబ్బరు బంత్తు చిత్రం ఫేమ్‌ పచ్చుముత్తు తమిళరసన్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతాన్ని అందించనున్నట్లు  ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే  ధనుష్‌ అభిమానులకు ఖుషీనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)