Breaking News

బాక్సాఫీస్‌ వేటలో యానిమల్‌ బ్లాక్‌ బస్టర్‌

Published on Mon, 12/18/2023 - 00:44

బాక్సాఫీస్‌ వద్ద ‘యానిమల్‌’ వసూళ్ల వేట కొనసాగుతోంది. తొలి చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’తోనే సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఆ తర్వాత హిందీ పరిశ్రమ వైపు వెళ్లారు. అక్కడ ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రాన్నే ‘కబీర్‌ సింగ్‌’గా రీమేక్‌ చేసి, మరో సూపర్‌ హిట్‌ అందుకున్నారు. ఈ రెండు చిత్రాలు ఒక ఎత్తయితే సందీప్‌ తెరకెక్కించిన మూడో చిత్రం ‘యానిమల్‌’  వసూళ్ల పరంగా మరో ఎత్తు అనాలి.

రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకునిగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న విడుదలై, సంచలన వసూళ్లతో దూసుకెళుతోంది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 116 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. ఇక తొలి వారాంతానికి రూ. 356 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించింది. ఈ సినిమా 16 రోజులకు ప్రపంచవ్యాప్తంగా రూ. 817.36 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను సాధించిందని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.

రణ్‌బీర్‌ కపూర్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించే దిశగా ఈ చిత్రం దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ సాధించిన వసూళ్ల ప్రకారం ఈ ఏడాది విడుదలై, అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాల్లో ‘యానిమల్‌’ టాప్‌ ఫైవ్‌లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది షారుక్‌ ఖాన్  హీరోగా నటించిన ‘జవాన్ ’, ‘పఠాన్ ’ చిత్రాలు రూ. వెయ్యి కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ కొల్లగొట్టి మొదటి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి.

ఇక ‘యానిమల్‌’ చిత్రం తెలుగులోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. తెలుగు అనువాదాన్ని ‘దిల్‌’ రాజు విడుదల చేశారు. రిలీజ్‌ అయిన తొలి రోజే రూ. 15 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించిందని ‘దిల్‌’ రాజు పేర్కొన్నారు.  తెలుగు వెర్షన్‌ ఇప్పటివరకూ దాదాపు రూ. 60 కోట్ల పైగా గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు సమాచారం.

ఇలా ఈ ఏడాది సందీప్‌ రెడ్డి బాక్సాఫీస్‌ని షేక్‌ చేసే చిత్రం తీశారు. ఈ చిత్రానికి ఆయన సోదరుడు ప్రణయ్‌ రెడ్డి వంగా ఓ నిర్మాత. రష్మికా మందన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అనిల్‌ కపూర్, బాబీ డియోల్, త్రిప్తి దిమ్రి కీలక పాత్రలు పోషించారు. ‘యానిమల్‌’కి రెండో భాగం ‘యానిమల్‌ పార్క్‌’ రానున్న సంగతి తెలిసిందే.
 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు