Breaking News

సందీప్ రెడ్డి యానిమల్‌.. ఆ సీన్‌ కూడా కాపీనేనా?

Published on Thu, 01/04/2024 - 17:58

రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించిన చిత్రం ‘యానిమల్‌’. డిసెంబర్ 1న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. టాలీవుడ్ డైరెక్టర్  సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. ఈ మూవీపై మొదట చాలామంది విమర్శలొచ్చాయి. అయితే విమర్శలతో పాటు ప్రశంసలు కూడా అదేస్థాయిలో వచ్చాయి. అయితే ఈ చిత్రంలో ఫైట్‌ సీన్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. 

(ఇది చదవండి: 'యానిమల్‌' సినిమా చూసి నా కూతురు ఏడ్చేసింది.. కాంగ్రెస్‌ ఎంపీ ఫైర్‌)

అయితే తాజాగా బాబీ డియోల్, రణ్‌బీర్‌ కపూర్‌  క్లైమాక్స్ ఫైట్ సీన్‌పై కాపీ విమర్శలు వైరలవుతున్నాయి. 2001లో వచ్చిన ఆషిక్‌ మూవీలోని సీన్‌ను కాపీ కొట్టారంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.  ఆషిక్‌ మూవీ వీడియోను షేర్ చేసిన ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేశాడు. నేను పొరపాటున రాంగ్ యానిమల్ మూవీ సీన్ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.  అయితే ఆషిక్ చిత్రంలో బాబీ డియోల్ హీరోగా నటించారు. 

అయితే గతంలోనూ యానిమల్‌పై కాపీ ఆరోపణలు వచ్చాయి. యానిమల్ ట్రైలర్‌ను విడుదలైన వెంటనే హువా మైన్ పాటలో రష్మిక, రణబీర్ ఫ్లైట్‌ సీన్‌ను 50 షేడ్స్ ఆఫ్ గ్రే చిత్రం కాపీ కొట్టారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. అంతే కాకుండా మరో ఫైట్ సీక్వెన్స్ కొరియన్ చిత్రం నుండి కాపీ చేశారంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. ఎన్ని విమర్శలు ఎదురైనా ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అనిల్ కపూర్, త్రిప్తి డిమ్రీ, శక్తి కపూర్, సురేష్ ఒబెరాయ్, ప్రేమ్ చోప్రా బాలీవుడ్ తారలు నటించారు. 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)