Breaking News

ఫ్లో చూస్తుంటే సినిమా కూడా తీసేస్తారేమో!

Published on Wed, 02/11/2026 - 05:03

గతేడాది, ఈసారి వరసగా 'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకరవరప్రసాద్' సినిమాలతో అద్భుతమైన సక్సెస్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. త్వరలో కొత్త మూవీ ప్రకటనతో వస్తానని కొన్నిరోజుల క్రితమే చెప్పాడు. కానీ అనిల్.. నెక్స్ట్ ఏ హీరోతో చేయబోతున్నాడు? స్టోరీ ఏంటి? ఇంకా ఎవరెవరు నటించబోతున్నారు? అని రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వాటికి పుల్‌స్టాప్ పెడుతూ స్వయంగా ఈ డైరెక్టరే క్లారిటీ ఇచ్చేశాడు.

'నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా. నటీనటులు, కథ, టైటిల్ కూడా పెట్టేశారు. ఈ ఫ్లో చూస్తుంటే యాక్షన్, కట్ కూడా చెప్పేస్తారేమో. మీ ఉత్సాహన్ని నేను అర్థం చేసుకోగలను. అలాగే నేను చేసే సినిమా ఏంటి ఎవరితో అనేది అతి త్వరలో నిజమైన పూర్తి వివరాలు మీకు అందిస్తాం' అని అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు.

అయితే అనిల్.. తన తర్వాత సినిమా వెంకటేశ్ హీరోగా తీయబోతున్నాడని పుకార్లు వచ్చాయి. ఈ ప్రాజెక్టులోనే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కూడా నటిస్తాడని.. వెంకీ, ఫహాద్ బావబావమరిదిగా నటిస్తారని.. ఇందులో వెంకీ సరసన కీర్తి సురేశ్, పూజా హెగ్డే హీరోయిన్లు అని.. ఫహాద్ సరసన ఆషికా రంగనాథ్ కనిపిస్తుందని మాట్లాడుకున్నారు. అలానే మూవీకి 'శ్రీమతి లలితా రెడ్డి' అనే టైటిల్ కూడా నిర్ణయించారని, ప్రస్తుతం ఓటీటీ చర్చలు జరుగుతున్నాయని.. ఇది పూర్తవగానే అనౌన్స్‌మెంట్ ఉంటుందని టాక్ అయితే వినిపిస్తోంది. మరి ఇవే నిజమవుతాయా? లేదంటే అనిల్ రావిపూడి.. వేరే ప్రాజెక్ట్ చేస్తాడా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)