యాంకరింగ్‌లో సిండికేట్‌.. ఈవెంట్లు చేస్తానో, లేదో?: ఉదయభాను

Published on Thu, 07/10/2025 - 16:55

ఉదయభాను (Udaya Bhanu).. ఒకప్పుడు తెలుగులో టాప్‌ యాంకర్‌. ఏ షో చూసినా ఆమె గొంతే వినిపించేది. ఏ ఈవెంట్‌కు వెళ్లినా ఆవిడ హడావుడే కనిపించేది. బుల్లితెరపై సెటిలవ్వడానికి ముందు సినిమాలు కూడా చేసింది. అప్పట్లో టాలీవుడ్‌లో తోపు యాంకర్‌గా వెలుగొందిన ఉదయభాను తర్వాత సడన్‌గా తెరపై కనుమరుగైపోయింది.

తొక్కేశారంటూ భావోద్వేగం
గతేడాది ఓ సభలో తన కెరీర్‌ను తొక్కేశారని ఎమోషనలైంది. టీవీలో కనిపించి ఐదు సంవత్సరాలైందని పేర్కొంది. అయినా అలుపెరగని ప్రయత్నాలు చేయడం వల్లే ఇంకా నిలబడ్డానంది. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మనసులో నుంచి తనను తుడిపేయలేరని చెప్పుకొచ్చింది. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసింది ఉదయభాను.  సుహాస్‌ హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ఉదయభాను వ్యాఖ్యాతగా వ్యవహరించింది. 

టీవీ ఇండస్ట్రీలో సిండికేట్‌
ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దర్శకుడు విజయ్‌ కనకమేడల.. యాంకర్‌ను చూసి సర్‌ప్రైజ్‌ అయ్యాడు. అదే విషయం మైక్‌ అందుకుని మాట్లాడుతూ.. చాలారోజుల తర్వాత ఉదయభాను మళ్లీ ఈవెంట్స్‌ చేస్తున్నారు. థాంక్యూ అన్నాడు. వెంటనే ఉదయభాను కలగజేసుకుంటూ.. ఇదొక్కటే చేశానండి. మళ్లీ చేస్తానన్న గ్యారెంటీ లేదు. రేపే ఈవెంట్‌ ఉంది, చేయాలనుకుంటాం. కానీ, ఆరోజు వచ్చాక ఈవెంట్‌ మన చేతిలో ఉండదు. అంత పెద్ద సిండికేట్‌ ఎదిగింది.

ఉన్నదున్నట్లు చెప్తా..
నా మనసులో ఉన్న నిజమే చెప్పాను. సుహాస్‌ మా బంగారం కాబట్టి చేయగలిగాను అని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఉదయభానుకు యాంకరింగ్‌ చేయాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ తనకు ఈవెంట్లు ఇవ్వడం లేదా? తనవరకు అవకాశాలను వెళ్లనివ్వడం లేదా? అని నెటిజన్లు రకరకాలుగా చర్చిస్తున్నారు. సిండికేట్‌ అన్న పెద్ద పదం వాడిందంటే తనను కావాలనే టీవీ ఇండస్ట్రీ నుంచి సైడ్‌ చేశారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

చదవండి: మాజీ డిప్యూటీ కలెక్టర్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న నటి

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)