Breaking News

యాంకర్‌ సుమ పెళ్లి చీర ధరెంతో తెలుసా? అదే ఆమె రేంజ్‌ అట

Published on Wed, 08/31/2022 - 16:00

బుల్లితెరపై యాంకర్‌ సుమ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె షో అంటే కంటెస్టెంట్స్‌కే కాదు ప్రేక్షకుల్లో సైతం జోష్‌ వస్తుంది. తనదైన పంచ్‌లు, వాక్‌చాతుర్యంతో అందరిని అబ్బురపరుస్తుంది సుమ. మైక్‌ పట్టుకుంటే చాలు గలగల మాట్లాడుతూనే ఉంటుంది. అందుకే టీవీ షోలు మాత్రమే స్టార్‌ హీరోల మూవీ ఈవెంట్స్‌, ప్రీ-రిలీజ్‌, ప్రమోషన్స్‌ సుమ లేకుండ  ఉండవు. ఇలా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుమ షోలోనే కాదు సోషల్‌ మీడియా వేదికగానూ ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌ను అలరిస్తోంది. ఆమె సొంతంగా ఓ యూట్యూబ్‌ చానల్‌ను రన్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 

చదవండి: సుమన్‌ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్‌ చానళ్లకు నటుడు వార్నింగ్‌

ఈ చానల్‌ ద్వారా తన వ్యక్తిగత, కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఆమె షేర్‌ చేసుకుంటుంది. తాజాగా షేర్‌ చేసిన ఓ స్పెషల్‌ వీడియోలో తన పెళ్లి రోజులను గుర్తు చేసుకుంది ఆమె. వాళ్ల అమ్మ 80వ పుట్టిన రోజు సందర్భంగా సుమ తల్లికి ఖరీదైన చీర కొనిపెట్టింది. ఈ సందర్భంగా  షాపింగ్‌కు వెళ్లిన సుమ అక్కడ  షాపింగ్‌ మాల్లో తన పెళ్లి చీర ఖరీదు ఎంతో చెప్పింది. అక్కడ తల్లితో కలిసి ఆమె చీరలు చూస్తుండగా.. ఇవన్ని రూ. 15 వేల లోపు చీరలని, మీరేంజ్‌ సారీస్‌ పై ఫ్లోర్లో ఉంటాయని సేల్స్‌మాన్‌ చెప్పాడు. అతడి మాటలకు సుమ మేం ఈ రేంజ్‌లోనే తీసుకుంటామంటూ తనదైన స్టైల్లో పంచులు వేసింది. అక్కడ చీరలు, వాటి ప్రత్యేకత, డిజైన్స్‌ గురించి ఆరా తీసింది. ఈ నేపథ్యంలో తనకు ఓ చీర నచ్చగా దాని ధరెంత అని అడిందామె.

చదవండి: కూతురితో కలిసి బుల్లితెరపై సందడి చేసిన మహేశ్‌ బాబు

రూ. 2 లక్షలు అని చెప్పడంతో షాకైన సుమ.. తాను ఇప్పటివరకు ఇంత కాస్ట్‌లీ చీర కట్టలేదని, పెళ్లికే రూ. 11 వేల చీర కట్టానంటూ అసలు విషయం చెప్పేసింది. ఇక స్టార్‌ యాంకర్‌ అయిన సుమ తన పెళ్లి చీర ఖరీదు చెప్పడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసిన సుమ పెళ్లి చీర ధర చర్చనీయాంశమైంది. ‘అప్పట్లో రూ. 11 వేలు అంటే కాస్ట్‌లీ యే కదా అని కొందరు కామెంట్స్‌ చేస్తుండగా.. మీ రెంజ్‌కి ఇది తక్కువే’ అంటూ మరికొందరు స్పందిస్తున్నారు. కాగా రాజీవ్‌తో పెళ్లి సమయానికి సుమ అప్పడప్పుడే యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. యాంకర్‌ కంటే ముందు ఆమె పలు టీవీ పలు సీరియల్స్‌లో నటించింది. కాగా రాజీవ్‌ కనకాల-సుమల పెళ్లి 1999 ఫిబ్రవరి 10న జరిగింది. 

Videos

Vizianagaram: పలుచోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సిరాజ్ అంగీకారం

విగ్రహానికి టీడీపీ జెండాలు కట్టడంపై అవినాష్ రెడ్డి ఫైర్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

Mahanadu: డ్వాక్రా సంఘాలకు బెదిరింపులు

ప్రభుత్వ స్కూళ్లలొ చదువులు అటకెక్కాయి: YS జగన్

మేడిగడ్డ బ్యారేజీపై NDSA ఇచ్చిన నివేదిక అంతా బూటకం: కేటీఆర్

సినిమాలతో ప్రభుత్వానికి ఏం సంబంధం అని గతంలో పవన్ కళ్యాణ్ అన్నారు

రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలి: YS జగన్

అల్లు అరవింద్ లీజు థియేటర్లన్నింటిలోనూ తనిఖీలు

కడపలోనే మహానాడు పెడతావా..! వడ్డీతో సహా చెల్లిస్తా...

Photos

+5

జబర్దస్త్ ఐశ్వర్య నూతన గృహప్రవేశ వేడుక (ఫొటోలు)

+5

కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ (ఫొటోలు)

+5

మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)

+5

పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సంద‌ర్శించారా? (ఫొటోలు)

+5

NTR Jayanthi : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి (చిత్రాలు)

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)